పొట్ట గుట్టలా ఉందని బాధపడుతున్నారా..? జస్ట్ దీన్ని నానబెట్టి తింటే కొవ్వును కోసినట్టే..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.. బొడ్డు కొవ్వును తగ్గించుకునేందుకు పలు రకాలుగా కష్టపడుతున్నారు. గంటలకొద్ది వ్యాయామం చేస్తూ.. జిమ్‌కు వెళ్లి చెమటోడుస్తూ.. డైటింగ్ లు చేస్తూ.. బరువు తగ్గేందుకు శ్రమిస్తున్నారు.. అయితే.. కొన్ని డ్రైఫ్రూట్స్, పండ్లతో బరువు ఈజీగా తగ్గొచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు.. బొడ్డు కొవ్వు (బెల్లీ ఫ్యాట్) ను తగ్గించుకునేందుకు పలు రకాలుగా కష్టపడుతున్నారు. గంటలకొద్ది వ్యాయామం చేస్తూ.. జిమ్‌కు వెళ్లి చెమటోడుస్తూ.. డైటింగ్ లు చేస్తూ.. బరువు తగ్గేందుకు శ్రమిస్తున్నారు.. అయితే.. కొన్ని డ్రైఫ్రూట్స్, పండ్లతో బరువు ఈజీగా తగ్గొచ్చని డైటీషియన్లు చెబుతున్నారు. అయితే.. శక్తివంతమైన అంజీర్ డ్రై ఫ్రూట్ తో బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి.. అంజీర్ శక్తివంతమైన డ్రై ఫ్రూట్. ఏ సీజన్లోనైనా తినడానికి అనుకూలం.. అంజీర్ ను పచ్చిగా లేదా డ్రైఫ్రూట్ గా కూడా తీసుకోవచ్చు.. ఇవి ప్రత్యేకమైన ఆకృతితోపాటు.. తినడానికి రుచిగా ఉంటాయి..
అంజీర్ (అత్తిపండ్లు) లో ఎన్నో పోషకాలతోపాటు.. ఔషధ గుణాలు దాగున్నాయి.. ఇవి ఆరోగ్యానికి మేలు చేసి.. అనేక వ్యాధులను నివారిస్తాయి.. ఎండు అత్తి పండ్లను నీటిలో కలిపి తింటే రెట్టింపు ఫలితాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అంజీర్‌ను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..
అంజీర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అత్తిపండ్లు బరువు నిర్వహణలో సహాయపడతాయి. అత్తి పండ్లు గుండెకు ఆరోగ్యకరమైన ఆహారం. ఇవి గుండె సమస్యలను దూరం చేస్తాయి.. అత్తిపండ్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంజీర్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మంచిది.. ఎందుకంటే అవి రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి..
అంజీర్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అత్తిపండ్లు పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. మలబద్ధకం సమస్యలు ఉన్నవారు అంజీర పండ్లను తింటే ఆ సమస్య తగ్గుతుంది. అత్తి పండ్లను తింటే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
అత్తి పండ్లలో జింక్, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. మహిళల్లో సంతానోత్పత్తిని పెంచేందుకు అంజీరపండ్లు సహకరిస్తాయి. మెనోపాజ్ అనంతర అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.. నానబెట్టిన అంజీర పండ్లను తినడం వల్ల శరీరంలోని హార్మోన్ల మార్పులకు చాలా మంచిది.
అంజీర్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పొటాషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ నియంత్రణలో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులోని ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్, ఫినాల్ బీపీ నుంచి ఉపశమనం లభించేలా చేయడంతోపాటు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అంజీర్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఎ కూడా చర్మ ఆరోగ్యానికి చాలా అవసరం. అంజీర్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దీంతో చర్మం యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
ఉదయాన్నే అంజీర్ తినడం వల్ల..
అత్తి పండ్లను నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినడం చాలా మంచిది.. అలాగే నానబెట్టిన అంజీర్ నీటిని తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు వెళ్లిపోతాయి. దీనికోసం ముందుగా రాత్రివేళ కొన్ని నీటిలో అంజీర్ ను నానాబెట్టండి.. ఉదయాన్నే బ్రష్ చేసిన అనంతరం ఆ నీటిని తాగడంతోపాటు.. అంజీర్ ను తినండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..