నెల పాటు లవంగం నీటిని పరగడుపున తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

12 January 2025

TV9 Telugu

TV9 Telugu

లవంగంలేని మాంసాహార వంటకాలని ఊహించలేం కదా! మసాలాల్లో రారాజులాంటి లవంగానికి కేవలం ఘాటు రుచి మాత్రమే కాదు... బోలెడు ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయంటున్నా ఆరోగ్య నిపుణులు

TV9 Telugu

పంటి నొప్పి వచ్చినప్పుడు లవంగం నూనె వాడితే ఉపశమనంగా ఉంటుంది. లవంగంలోని నూనెలు.. పంటిపై బ్యాక్టీరియా విస్తరించకుండా చేసి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి

TV9 Telugu

చురుగ్గా నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన మాంగనీస్‌, పీచు ఈ లవంగాల్లో అధికంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండాలంటే లవంగాలని మోతాదు మేరకు ఆహారంలో తీసుకుంటే మంచిది

TV9 Telugu

ముఖంపై నల్లని మచ్చలు, యాక్నెవంటివి తొలగిపోవడానికి చక్కని ఆహారం. కాసిని నీళ్లలో లవంగాలని వేసి మరిగించి దానికి కొద్దిగా తేనె, పెప్పర్‌మింట్‌ ఆయిల్‌ కలిపితే చక్కని మౌత్‌ ఫ్రెషనర్‌గా మారిపోతుంది

TV9 Telugu

ముఖ్యంగా చలికాలంలో రోజూ ఖాళీ కడుపుతో లవంగం నీటిని తాగడం వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఈ నీరు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీరాన్ని వైరస్‌ల నుండి కాపాడుతుంది

TV9 Telugu

4 లవంగాలు నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఇలా ఈ నీటిని వరుసగా 25 రోజుల పాటు తాగితే అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ విధంగా లవంగం నీటిని తాగడం వల్ల పొట్ట శుభ్రపడుతుంది

TV9 Telugu

ఇది శరీరాన్ని అనేక వ్యాధులకు దూరంగా ఉంచుతుంది. లవంగం నీరు శరీర జీవక్రియను పెంచడంలో, అవాంఛిత కొవ్వును తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. తద్వారా వేగంగా బరువు తగ్గొచ్చు

TV9 Telugu

నోటి దుర్వాసన , చిగుళ్ల సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ఇది సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ లవంగం నీటిని తాగితే ఒంట్లో షుగర్ లెవెల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. అయితే దీనిని ప్రయత్నించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి