‘వైకుంఠపురం’ ఇంటి ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘అల..వైకుంఠపురములో’. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎక్కువగా భాగం ‘వైకుంఠపురం’ అనే హౌస్‌లో చిత్రీకరణ జరుపుకుంది. ఇక రీల్‌లో ఉన్న ఆ హౌస్ రియల్‌లో ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం.! తెలుగులో పాపులర్ న్యూస్ ఛానల్‌తో పాటుగా ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ నడుపుతున్న ఓ మీడియా సంస్థ అధినేత కూతురు సొంత ఇల్లు […]

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘అల..వైకుంఠపురములో’. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలయ్యి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎక్కువగా భాగం ‘వైకుంఠపురం’ అనే హౌస్‌లో చిత్రీకరణ జరుపుకుంది. ఇక రీల్‌లో ఉన్న ఆ హౌస్ రియల్‌లో ఎవరిదో ఇప్పుడు తెలుసుకుందాం.!
తెలుగులో పాపులర్ న్యూస్ ఛానల్‌తో పాటుగా ఇతర ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ నడుపుతున్న ఓ మీడియా సంస్థ అధినేత కూతురు సొంత ఇల్లు అని ఫిలింనగర్ టాక్. అంతేకాకుండా ఈ ఇంటి విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని సమాచారం. హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఇళ్లలో ఒకటైన దీనిపై అల్లు అర్జున్ ఎప్పుడో మనసు పారేసుకున్నాడట. ఇంటీరియర్ డిజైనింగ్ చూసి ముచ్చట పడిన బన్నీ.. అలాంటి ఇంటిని ఒకటి నిర్మించే పనిలో పడ్డాడని తెలుస్తోంది. ఏది ఏమైనా త్రివిక్రమ్ మార్క్‌కు తగ్గట్టు.. ఈ ఇంటి రిచ్‌నెస్‌కు ప్రేక్షకులు ఫిదా అయిపోవడం ఖాయం.