డెత్ వారెంట్ ప్రకారమే ఉరి: నిర్భయ కేసులో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

నిర్భయ కేసులో దోషులపై జారీ అయిన డెత్ వారెంట్ ప్రకారమే ఉరి శిక్షను అమలు చేయాలన్నదే మోదీ ప్రభుత్వం ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి. నిర్భయ దోషులను శిక్షించడంపై కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. న్యాయప్రక్రియలో లోపాలు సవరించే పని ప్రారంభించామని చెప్పారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో లోపాలపై అధ్యయనం […]

డెత్ వారెంట్ ప్రకారమే ఉరి: నిర్భయ కేసులో కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Follow us

|

Updated on: Jan 17, 2020 | 2:18 PM

నిర్భయ కేసులో దోషులపై జారీ అయిన డెత్ వారెంట్ ప్రకారమే ఉరి శిక్షను అమలు చేయాలన్నదే మోదీ ప్రభుత్వం ఉద్దేశమని క్లారిటీ ఇచ్చారు కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి. నిర్భయ దోషులను శిక్షించడంపై కేంద్రం కృతనిశ్చయంతో ఉందని ఆయన అన్నారు. కోర్టు ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి.. న్యాయప్రక్రియలో లోపాలు సవరించే పని ప్రారంభించామని చెప్పారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాల్లో లోపాలపై అధ్యయనం చేయడానికి కమిటీ ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఐపీసీ, సీఆర్పీసీ చట్టాలను లోపాలు లేకుండా చేసేందుకు సవరణలు తీసుకొస్తామని అన్నారు. పోక్సో చట్టంలో మోదీ సర్కార్ మార్పులు చేసిందని, అందువల్లనే 18 ఏళ్ళలోపు యువతులపై నేరాలు జరిగితే దోషులకు రెండు నెలల్లోపే శిక్ష పడుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. అందువల్లనే వరంగల్‌లో చిన్నారిని చిదిమేసిన రాక్షసునికి కేవలం 51 రోజుల్లోనే శిక్ష పడిందని అన్నారు.

నిర్భయ తరహా ఘటనల్లో దోషులకు క్షమాపణ తగదని రాష్ట్రపతి గతంలోనే అన్నారని, దానికి అనుగుణంగా మరోసారి తనముందుకు వచ్చిన క్షమాభిక్ష అభ్యర్థనను ప్రెసిడెంట్ కోవింద్ కొట్టేశారని చెప్పారు. హోంశాఖకు వచ్చిన మెర్సీ పిటిషన్‌ను మేం ఏమాత్రం జాప్యం చేయకుండా డిస్పోజ్ చేశామని, అంతే వేగంగా రాష్ట్రపతి కూడా నిర్ణయం తీసుకున్నారని అన్నారయన.

ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఎన్నికల తర్వాత రీచార్జ్ చార్జీల బాదుడు..?
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఊరికే గ్రేట్ డైరెక్టర్ అవ్వరు మరి..!
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
ఫిన్ లాండ్ ప్రజలు అంత హ్యాపీ ఎందుకబ్బా.. కారణాలు ఇవే..
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
శ్రీశైలం భక్తులకు అలర్ట్.. ఆ పూజలను రద్దు చేసిన దేవస్థానం
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా
ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా