‘పుష్ప’కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

'పుష్ప'కు ఆరో వేలు.. అసలు ట్విస్ట్ ఇదేనా..

Pushpa First Look: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘పుష్ప’. నిన్న బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇక విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. టైటిల్, అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‌లో కూర్చున్న […]

Ravi Kiran

|

Apr 09, 2020 | 2:10 PM

Pushpa First Look: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘పుష్ప’. నిన్న బన్నీ బర్త్ డే సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ పక్కా మాస్ లుక్‌లో కనిపిస్తున్నాడు.

ఇక విడుదలైన పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. టైటిల్, అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్‌లో కూర్చున్న పోస్టర్‌లో పలు ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డాయి. టైటిల్‌లో చేతి వేలి ముద్రలు కనిపిస్తుండగా.. బన్నీ కాలికి ఆరు వేళ్లు కనిపిస్తున్నాయి. బ‌న్నీ కాలికి ఆరో వేలు ఉండ‌టం వెనుక ఏదైనా ట్విస్ట్ ఉందా? అనే విష‌యం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ఏకకాలంలో విడుదల కానుంది. రష్మిక హీరోయిన్‌గా నటిస్తోంది. తమిళ హీరో విజయ్ సేతుపతి ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

For More News:

ధరలు పెంచితే ఏడేళ్ల జైలు.. నిత్యావసర వస్తు చట్టం అమలు..

ఆ మూడింటిని జూన్ వరకు బంద్ చేస్తారా..?

కరోనా కరాళ నృత్యం.. ప్రపంచవ్యాప్తంగా 15 లక్షలు దాటిన కేసులు..

దేశంలో 6 వేలకు చేరుతున్న పాజిటివ్ కేసులు.. ఏయే రాష్ట్రంలో ఎలా ఉందంటే..

‘తబ్లీఘీ జమాత్’ ఘటన.. కేంద్రం, అజిత్ దోవల్‌పై మహారాష్ట్ర హోంమంత్రి సంచలన వ్యాఖ్యలు..

కోహ్లీ అంటే ఆస్ట్రేలియా క్రికెటర్లకు భయం..

మద్యం అమ్మకాలకు అనుమతివ్వండి.. 10 రాష్ట్రాల సీఎంలకు లేఖలు..

కరోనా కల్లోలం.. అమెరికాలో ఒక్క రోజులోనే 1,940 మంది మృతి..

గాంధీ ఆసుపత్రిలో కరోనా బాధితుల మెనూ ఇదే…

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu