సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీనటి పూనమ్ కౌర్

హైదరాబాద్ : సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారంటూ ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ హైదరాబాద్‌‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తనపై పోస్టింగ్ చేస్తూ.. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారనే విశ్వాసం తనకు ఉందన్నారు. తనకు జరిగినట్టు వేరే అమ్మాయికి […]

సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సినీనటి పూనమ్ కౌర్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Apr 17, 2019 | 9:43 PM

హైదరాబాద్ : సోషల్ మీడియాలో తనపై అసభ్యకరమైన పోస్టులు చేస్తున్నారంటూ ప్రముఖ సినీనటి పూనమ్ కౌర్ హైదరాబాద్‌‌లోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో గుర్తు తెలియని కొందరు వ్యక్తులు తనపై పోస్టింగ్ చేస్తూ.. తనను మానసికంగా వేధిస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులను కోరారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటారనే విశ్వాసం తనకు ఉందన్నారు. తనకు జరిగినట్టు వేరే అమ్మాయికి జరగకూడదని కోరుకుంటున్నానని ఆమె అన్నారు.