టిక్ టాక్ యాప్‌ను వెంటనే తొలగించండి – కేంద్రం
ఢిల్లీ: టిక్ టాక్ యాప్‌ను తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలను ఆదేశించింది. చైనాకు చెందిన ఈ యాప్ పై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇక దీన్ని నిషేదించాలని మదురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనితో కేంద్రం దీనిపై నిషేధం విధించింది. మరోవైపు […]
ఢిల్లీ: టిక్ టాక్ యాప్‌ను తొలగించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్, యాపిల్ సంస్థలను ఆదేశించింది. చైనాకు చెందిన ఈ యాప్ పై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇక దీన్ని నిషేదించాలని మదురైకి చెందిన సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త ముత్తు కుమార్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం టిక్‌టాక్‌పై నిషేధం విధించాలని కేంద్రాన్ని ఆదేశించింది. దీనితో కేంద్రం దీనిపై నిషేధం విధించింది.
మరోవైపు మద్రాసు హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ టిక్ టాక్ సంస్థ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు స్టేకు నిరాకరించింది.