రాహుల్‌పై పరువునష్టం దావా వేస్తా : బీహార్ డిప్యూటీ సీఎం

పట్నా : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై పరువునష్టం దావా వేస్తానని బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ అన్నారు. “దొంగలందరూ వారి పేర్ల వెనుక మోదీ అని పెట్టుకున్నారు” అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుశీల్‌ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అని పేరు ఉండటం నేరమా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు మమ్మల్నిందరినీ అవమానించేలా ఉన్నాయని.. అందుకే రెండురోజుల్లో పట్నా హైకోర్టులో రాహుల్‌గాంధీపై పరువునష్టం దావా వేస్తానని […]

రాహుల్‌పై పరువునష్టం దావా వేస్తా : బీహార్ డిప్యూటీ సీఎం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 16, 2019 | 8:08 PM

పట్నా : కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై పరువునష్టం దావా వేస్తానని బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ మోదీ అన్నారు. “దొంగలందరూ వారి పేర్ల వెనుక మోదీ అని పెట్టుకున్నారు” అంటూ రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుశీల్‌ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ అని పేరు ఉండటం నేరమా అని ఆయన ప్రశ్నించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు మమ్మల్నిందరినీ అవమానించేలా ఉన్నాయని.. అందుకే రెండురోజుల్లో పట్నా హైకోర్టులో రాహుల్‌గాంధీపై పరువునష్టం దావా వేస్తానని సుశీల్‌కుమార్‌ మోదీ పేర్కొన్నారు.

కాగా రాహుల్ వాడిన పదాలు నేరమా? అని సుశీల్ మోదీని విలేకరులు అడగగా, మోదీ ఇంటిపేరుతో ఉండడం తప్పా? అని ఆయన్ని తిరిగి ప్రశ్నించారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. దేశంలో ఉన్న దొంగలంతా మోదీలే ఎందుకయ్యారని.. లలిత్‌మోదీ, నీరవ్‌మోదీ, నరేంద్రమోదీ వీరందరి ఇంటిపేరు మోదీయే అని రాహుల్‌ అన్నారు. రఫేల్‌ యుద్ధవిమానాల కొనుగోలు వ్యవహారంలో తమకు ఆపాదిస్తూ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు సోమవారం రాహుల్‌గాంధీని ఆదేశించిన సంగతి తెలిసిందే.