విపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోదీ
హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో విపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటుంబపాలన అంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మెట్రో.. ఢిల్లీ కంటే వేగంగా అభివృద్ది చెందేదని, కానీ ఇక్కడి సీఎం.. ఓటు బ్యాంక్ రాజకీయాలు, అతని కుటుంబం వల్ల అభివృద్ది పనులు ఆగిపోయాయని అన్నారు. మజ్లిస్ పార్టీ అభివృద్దికి స్పీడ్ బ్రేకర్ లాంటిదని.. పాతబస్తీలో మెట్రో వేస్తామంటే మజ్లిస్ అడ్డుకుందని అన్నారు. ఎంఐఎంకు అభివృద్ధి అంటేనే నచ్చదని.. మజ్లిస్‌కు […]

హైదరాబాద్ : ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో విపక్షాలపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. తెలంగాణలో కుటుంబపాలన అంతం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ మెట్రో.. ఢిల్లీ కంటే వేగంగా అభివృద్ది చెందేదని, కానీ ఇక్కడి సీఎం.. ఓటు బ్యాంక్ రాజకీయాలు, అతని కుటుంబం వల్ల అభివృద్ది పనులు ఆగిపోయాయని అన్నారు. మజ్లిస్ పార్టీ అభివృద్దికి స్పీడ్ బ్రేకర్ లాంటిదని.. పాతబస్తీలో మెట్రో వేస్తామంటే మజ్లిస్ అడ్డుకుందని అన్నారు. ఎంఐఎంకు అభివృద్ధి అంటేనే నచ్చదని.. మజ్లిస్‌కు రాత్రి కూడా మోదీనే గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం లాంటి వాళ్లు ఉండడం వల్ల టీఆర్‌ఎస్ కారు.. పనికిరాని కారుగా మారుతుందని.. కేసీఆర్ కారు స్టీరింగ్ మజ్లిస్ చేతిలో ఉందిని వ్యాఖ్యానించారు.
గడిచిన ఐదేళ్లలో ఈ దేశంలో శాంతి నెలకొందని అన్నారు. పాకిస్తాన్ అదుపులో ఉండి బాంబులు పేల్చే ప్రభుత్వం కావాలా? దేశాన్ని కాపాడే ప్రభుత్వం కావాలా? అంటూ ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక రాష్ట్రపతి, ప్రత్యేక ప్రధాని కావాలన్న నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను కాంగ్రెస్, మహాకూటమి నేతలు సమర్ధిస్తారా అని ప్రశ్నించారు. ఒమర్ వ్యాఖ్యలకు మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితమే నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లాతో కలిసి చంద్రబాబు ఏపీలో ప్రచారం చేశారని.. అందుకే టీడీపీని ఓడించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.