AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత భూభాగం సమీపంలో చక్కర్లు కొట్టిన పాక్ యుద్ధ విమానాలు

న్యూఢిల్లీ : పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు పాక్‌కు చెందిన నాలుగు ఎఫ్‌‌-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోన్.. భారత భూభాగానికి సమీపంలో ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడర్లు గుర్తించాయి. పంజాబ్‌లోని ఖేమ్‌కరణ్ సరిహద్దు ప్రాంతంలోకి అవి వచ్చినట్లు గుర్తించిన వెంటనే భారత్‌ ప్రతిస్పందించింది. సుఖోయ్‌ ఎస్‌యూ-ఎంకేఐ, మిరాజ్‌ యుద్ధ విమానాలతో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయడంతో వెంటనే అవి పాకిస్థాన్‌ భూభాగం వైపునకు […]

భారత భూభాగం సమీపంలో చక్కర్లు కొట్టిన పాక్ యుద్ధ విమానాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 01, 2019 | 10:09 PM

Share

న్యూఢిల్లీ : పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తోంది. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు పాక్‌కు చెందిన నాలుగు ఎఫ్‌‌-16 యుద్ధ విమానాలతో పాటు, ఓ భారీ డ్రోన్.. భారత భూభాగానికి సమీపంలో ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు భారత రాడర్లు గుర్తించాయి. పంజాబ్‌లోని ఖేమ్‌కరణ్ సరిహద్దు ప్రాంతంలోకి అవి వచ్చినట్లు గుర్తించిన వెంటనే భారత్‌ ప్రతిస్పందించింది. సుఖోయ్‌ ఎస్‌యూ-ఎంకేఐ, మిరాజ్‌ యుద్ధ విమానాలతో వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేయడంతో వెంటనే అవి పాకిస్థాన్‌ భూభాగం వైపునకు వెనుదిరిగాయి.

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో పాక్‌లోకి ప్రవేశించి భారత్‌ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. దీంతో అప్పటినుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. పాక్‌ తమ యుద్ధ విమానాలను భారత గగనతలంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. గత నెలలో జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ సరిహద్దుకి 10 కిలోమీటర్ల దూరంలో పాక్‌ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి. అప్పట్లో కూడా ఈ విషయాన్ని వెంటనే గుర్తించిన భారత్ వైమానిక దళం పాక్‌ చర్యలను తిప్పికొట్టింది.

Follow Us
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!
మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం ధరలు!
జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
జీవితంలో ప్రశాంతత కావాలంటే.. ఈ వంద ఒంటెల కథ మీరు తప్పక చదవాలి
సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..
సెప్టెంబర్ 26 రాశిఫలాలు: ఈ రాశుల వారికి కెరీర్‌లో కీలక మార్పులు..
భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం
భాద్రపద పౌర్ణమి రోజు ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం.. ఇంట్లో ఐశ్వర్యం
మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..
మంథనిలో టైమ్ మిషన్‌లో గణనాథుడు.. ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో..
రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..
రాజయోగం.. ఈ 3 రాశుల వారికి గోల్డెన్ టైమ్! ధనం, ఉద్యోగంలో..
కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి
కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి
అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!
అయ్యప్ప సన్నిధిలో అపచారం.. స్ట్రాంగ్ రూమ్‌లో షాకింగ్ ట్విస్ట్!
IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!
IPL 2027 వేలం ఇండియాలోనే.. గోవాలో మినీ ఆక్షన్‌!
సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు
సాటా ఆధ్వర్యంలో ఘనంగా 96వ సౌదీ నేషనల్ డే వేడుకలు