గ్రేటర్ ఎన్నికల దిశగా మరో అడుగు.. ఈసారి ఏంటంటే..?

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల దిశగా మరో అడుగు పడింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శనివారం నోటిఫికేషన్ జారీ చేసింది. తాజా నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. నిర్దేశిత గడువు కంటే సుమారు రెండు నెలల ముందే ఎన్నికలు జరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.

గ్రేటర్ ఎన్నికల దిశగా మరో అడుగు.. ఈసారి ఏంటంటే..?
Follow us

|

Updated on: Oct 31, 2020 | 6:57 PM

One more step for GHMC elections:  గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల నిర్వహణ దిశగా మరో అడుగు ముందుకేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఓటర్ల జాబితా రూపకల్పనకు శనివారం షెడ్యూలు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ ఏడవ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదా (డ్రాఫ్టు)ను వెలువరిస్తారు. దానిపై చర్చించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజకీయ పక్షాలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తుంది. నవంబర్ 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఓటర్ల జాబితా ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరిస్తారు. నవంబర్ 13వ తేదీన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో వున్న వార్డులు, రిజర్వేషన్లను కొనసాగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

ప్రస్తుతం గ్రేటర్ మునిసిపాలిటీ పాలక వర్గం కాలపరిమితి 2021 ఫిబ్రవరి 10వ తేదీ వరకు వుంది. అయితే… గడువు తేదీకి మూడు నెలల ముందు నుంచి ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించే అవకాశం వుంది. దానికి తోడు ప్రభుత్వం గ్రేటర్ ఎన్నికల నిర్వహణకు సంసిద్ధత ప్రకటించింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలలో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమవుతున్నట్లు కథనాలు వచ్చాయి. ఈ కథనాలను నిజం చేస్తూ.. గ్రేటర్ ఎన్నికల నిర్వహణ దిశగా రాష్ట్ర ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది.

గతంలో పలు కారణాలు చూపడం ద్వారా వివిధ రకాల స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తుండేవి రాష్ట్ర ప్రభుత్వాలు. చంద్రబాబు, వైఎస్ఆర్ జమానాలో స్థానిక సంస్థల ఎన్నికలు గడువులోగా జరిగిన దాఖలాలు అత్యంత అరుదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పలు రకాల స్థానిక సంస్థల ఎన్నికలు నిర్దేశిత గడువులోగానే పూర్తి చేస్తోంది కేసీఆర్ సర్కార్. ఈ నేపథ్యంలో గ్రేటర్ మునిసిపాలిటీ ఎన్నికలను కూడా పాలక మండలి గడువు తీరక ముందే నిర్వహించేందుకు రంగం సిద్దమవుతోంది.

ALSO READ: ఆఖరి నిమిషంలో వరునికి షాకిచ్చిన వధువు

ALSO READ: మోదీకి జగన్ లేఖ.. నిధులివ్వకపోతే..!

ALSO READ: కమలనాథులకు కేసీఆర్ ఓపెన్ ఛాలెంజ్

ALSO READ: 60 స్కాములు..30వేల కోట్ల దోపిడీ… నితీశ్‌పై మోదీ ధ్వజం!

ALSO READ:  సూరత్‌లో గోల్డ్ స్వీటు..ఖరీదు కిలో 9వేలు

ALSO READ: పోలీస్‌స్టేషన్‌పై దాడి..ధర్నాతో రెచ్చిపోయిన మహిళలు

ALSO READ: ఒక్క కారు..మూడు బైకులు.. ఒకేసారి ఢీ