Rashmika Mandanna: ముద్దు పెట్టి పారిపోయిన ఫ్యాన్.. షాక్‌లో రష్మిక!

ప్రస్తుతం హీరోయిన్ ‘రష్మికా మందన్న’ చేతినిండా సినిమాలతో కెరీర్‌లో దూసుకెళ్తోంది. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’తో హిట్ కొట్టిన ఈ భామ.. తాజాగా నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అలాగే కర్నాటకలోని ఆమె ఇంట్లో ఐటీ దాడుల వ్యవహారం కూడా గత కొద్ది రోజుల ముందు హీట్ పుట్టించింది. కాగా ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ మాత్రం ఫుల్లుగా వైరల్ అవుతోంది. తాజాగా రష్మిక ఓ ఈవెంట్‌కి వెళ్లి వస్తోన్న సందర్భంలో.. […]

Rashmika Mandanna: ముద్దు పెట్టి పారిపోయిన ఫ్యాన్.. షాక్‌లో రష్మిక!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 17, 2020 | 5:01 PM

ప్రస్తుతం హీరోయిన్ ‘రష్మికా మందన్న’ చేతినిండా సినిమాలతో కెరీర్‌లో దూసుకెళ్తోంది. తాజాగా ‘సరిలేరు నీకెవ్వరు’తో హిట్ కొట్టిన ఈ భామ.. తాజాగా నితిన్ హీరోగా నటించిన ‘భీష్మ్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అలాగే కర్నాటకలోని ఆమె ఇంట్లో ఐటీ దాడుల వ్యవహారం కూడా గత కొద్ది రోజుల ముందు హీట్ పుట్టించింది. కాగా ప్రస్తుతం ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ మాత్రం ఫుల్లుగా వైరల్ అవుతోంది.

తాజాగా రష్మిక ఓ ఈవెంట్‌కి వెళ్లి వస్తోన్న సందర్భంలో.. ఒక అభిమాని ఆమెతో సెల్ఫీ దిగడానికని వచ్చి.. ఆమెను ముద్దు పెట్టుకున్నాడు. ఆ ఫ్యాన్ చేసిన పనికి అటు రష్మికతో పాటు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఆ షాక్‌ నుంచి తేరుకునే లోపే.. ముద్దు పెట్టుకున్న అభిమాని పారిపోయాడు. ఇక ఈ వీడియో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. దీంతో రష్మిక ప్రోగ్రామ్‌ను ఆర్గనైజ్ చేసిన వాళ్లు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన వారు వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశారు.