AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YCP BJP Friendship: వైసీపీది వన్ సైడ్ లవ్.. ఏం చెప్పారు తులసీరెడ్డి!

బీజేపీ-వైసీపీ స్నేహంపై సెటైర్లు వేశారు ఇటీవల ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన ఎన్.తులసీరెడ్డి. బీజేపీతో స్నేహం కోసం వైసీపీ పలు అంశాలపై మాట మారుస్తుందన్నారు.

YCP BJP Friendship: వైసీపీది వన్ సైడ్ లవ్.. ఏం చెప్పారు తులసీరెడ్డి!
Rajesh Sharma
|

Updated on: Feb 17, 2020 | 5:12 PM

Share

APCC working president Tulasireddy satires on YCP-BJP friendship: కొత్తగా ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన ఎన్. తులసీరెడ్డి వైసీపీ, బీజేపీల స్నేహంపై సెటైర్లు వేశారు. ఆ రెండు పార్టీల ఫ్రెండ్షిప్ చూస్తుంటే గమ్మత్తనిపిస్తుదంటూనే రెండు పార్టీలపైనా.. మరీ ముఖ్యంగా వైసీపీపై మాటల తూటాలు పేల్చారు తులసీరెడ్డి.

బీజేపీ మీద వైసీపీది వన్ లవ్ అంటూ వ్యంగ్యోక్తులు విసిరారు తులసీరెడ్డి. బీజేపీతో పొత్తు కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోందని కామెంట్ చేశారు తులసీరెడ్డి. కేంద్ర మంత్రి వర్గంలో చోటు కోసం బొత్స సత్యనారాయణ, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ప్రేమ సందేశాలు పంపుతున్నారని అంటున్నారు తులసీరెడ్డి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామని చెప్పారు ఆ మాటలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాయని ఆయన ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక మొత్తం మాట మార్చేసి.. కేంద్రం దగ్గర మెడలు వంచి సాష్టంగ నమస్కారాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Also read: KCR’s birthday to be celebrated as farmer’s day

సీఏఏ బిల్లుకు పార్లమెంటులో మద్దతు పలికి ఇప్పుడు వ్యతిరేకిస్తామంటున్నామంటూ పిట్ట కథలు చెబుతున్నారని అన్నారాయన. ఐటీ దాడులు అనేవి నిరంతర ప్రక్రియ.. ఏపార్టీ వారు చిక్కినా చట్టం ముందు అందరూ సమానులేనని తులసీరెడ్డి చెబుతున్నారు.