Silver Spoon: లక్ అంటే ఇదీ.. 90పైసలకు కొన్న స్పూన్ అతడిని లక్షాధికారిని చేసింది.. ఎక్కడంటే
Silver Spoon: అదృష్టవంతుడిని చెడిపేవాడు లేదు.. దురదృష్టవంతుడిని బాగు చేసేవారు లేరు అంటారు.. అవును లక్ ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరీ తెలియదు..
Silver Spoon: అదృష్టవంతుడిని చెడిపేవాడు లేదు.. దురదృష్టవంతుడిని బాగు చేసేవారు లేరు అంటారు.. అవును లక్ ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరీ తెలియదు. రోడ్డుమీద చెత్త ఏరుకునే వ్యక్తికూడా లక్ కలిసి వస్తే… రాత్రికి రాత్రికే లక్షాధికారి అవుతాడు.. అలాంటి సంఘటన ఇంగ్లాండ్ లో చోటు చేసుకుంది.
ఒకొక్కసారి ఎందుకు పనికిరాదు అనుకున్న వస్తువు కూడా లక్షల్లో పలుకుతుంది. ఇంగ్లాండ్‌లోని ఓ వ్యక్తి వీధిలో దొరికే ఓ పాతకాలం నటి స్పూన్ ను కొనుగోలు చేసింది. అప్పుడు ఆ స్పూన్ ను కేవలం 90 పైసలతో మాత్రమే ఖరీదు చేసింది. అనంతరం ఆ స్పూన్ ను పాతకాలం నాటి స్పూన్ ను వేలం వేసే పోర్టల్ లో నమోదు చేశాడు.
సోమర్సెట్‌లోని లారెన్స్ అనే అరుదైన వస్తువులను వేలం వేసే పోర్టల్‌లో నమోదు చేసిన ఈ స్పూన్ చాలా అరుదైనది అని గుర్తించింది. మధ్య యుగం కాలం నాటి స్పూన్ గా గుర్తించడంతో ఆ స్పూన్ ఖరీదు ఒక్కసారిగా పెరిగిపోయింది. లారెన్స్ వేలంపాటదారుల వెండి నిపుణుడు అలెక్స్ బుట్చేర్ 5-అంగుళాల చెంచాను పరిశీలించగా, అది 13 వ శతాబ్దం చివరలో వెండి చెంచా అని గుర్తించారు . దీంతో ఈ స్పూన్ ప్రారంభ ధర రూ. 51,712 విలువగా నిర్ణయించారు. అయితే ఈ స్పూన్ చాలా అరుదైనది ని తెలియడంతో రోజు రోజుకీ దీని ఖరీదు పెరుగుతూ.. బిడ్డింగ్ పెరుగుతూ వచ్చింది. ఫైనల్‌గా దీనిని రూ.1,97,000లకు అమ్ముడు పోయింది. ట్యాక్స్ తో సహా అన్ని కలుపుకుంటే.. ఈ స్పూన్ రెండు లక్షలు పైగా ధరపలికింది.
Also Read: Kamakshi Deepam: మీ ఇంట్లో అఖండ ఐశ్వర్యాలతో నింపే కామాక్షిదీపం అంటే ఏమిటి.. ఎలా పెట్టాలంటే