Judgement: కొడుకు బాధ్యత 18 ఏళ్లకే తీరిపోదు.. అప్పటివరకు భరించాల్సిందే.. తండ్రికి షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు..
Obligation of father - Delhi HC: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కుమారుడికి 18 ఏళ్లు వచ్చినంత మాత్రాన తండ్రి బాధ్యతలు తీరిపోవని, అతడి చదువుకు సంబంధించిన ఖర్చంతా
Obligation of father – Delhi HC: ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. కుమారుడికి 18 ఏళ్లు వచ్చినంత మాత్రాన తండ్రి బాధ్యతలు తీరిపోవని, అతడి చదువుకు సంబంధించిన ఖర్చంతా తల్లి మాత్రమే భరించాలనడం సబబు కాదంటూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ మేరకు విడాకులు ఇచ్చిన భార్యకు ఇంటి నిర్వహణ ఖర్చుల కింద నెలకు రూ. 15 వేలు భర్త చెల్లించాలంటూ తీర్పునిచ్చింది. కుమారుడి చదువు పూర్తయ్యేవరకూ లేదా ఉద్యోగం సంపాదించే వరకూ భర్త ఈ మొత్తం చెల్లించాలంటూ ఆదేశించింది. విడాకుల తరువాత భార్యకు మనోవర్తి ఇవ్వడానికి అసలు కారణం.. ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూడటమేనని కోర్టు వ్యాఖ్యానించింది.
కాగా.. కేసు వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన దంపతులకు 1997 లో వివాహమైంది. అనంతరం వీరిద్దరూ 2011లో విడాకులు తీసుకున్నారు. వీరికి సంతానం ఒక అమ్మాయి, అబ్బాయి. అబ్బాయి వయస్సు 20 కాగా.. అమ్మాయి వయస్సు 18 ఏళ్లు. వీరిద్దరూ తల్లిదగ్గరే నివాసముంటున్నారు. కాగా విడాకుల అనంతరం.. కొంతమొత్తంలోనే భర్త చెల్లిస్తుండటంతో.. ఆమె కోర్టు మెట్లెక్కింది. చదువు, ఇతర ఖర్చుల భారం ఎక్కువగా ఉందని.. కోర్టుకు తెలిపింది.
అయితే.. విడాకులు తీసుకున్న మహిళ పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసే వరకు లేదా సంపాదించడం ప్రారంభించే వరకు ఖర్చులను భరించాలని తండ్రికి సూచించింది. దీనికి నెల నెల రూ. 15,000 చెల్లించాలని ఢిల్లీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఉద్యోగం వచ్చే వరకు తండ్రి బాధ్యత కూడా ఉంటుందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది.
Also Read: