స్వ‌౦త ఊరు రుణ౦ తీర్చుకు౦టున్న ప్రవాసులు

రైతు కుటుంబంలో జన్మించిన కారుసాల వెంకటసుబ్బారావు వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్‌ చదివారు. తరువాత‌ ఉద్యోగం రావడంతో అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడిన ఆయన పలు కంపెనీలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. వీరి స్వస్థల౦ ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామ౦. సొ౦త ఊరి బాగు కోసం ముందుకు వచ్చారు. రూ.4లక్షలు సొంత డబ్బులు వెచ్చించి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. తాను చదివిన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విద్యార్థులకు ఐదేళ్లపాటు మినరల్‌ వాటర్‌ను సొంత […]

స్వ‌౦త ఊరు రుణ౦ తీర్చుకు౦టున్న ప్రవాసులు
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:17 PM

రైతు కుటుంబంలో జన్మించిన కారుసాల వెంకటసుబ్బారావు వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్‌ చదివారు. తరువాత‌ ఉద్యోగం రావడంతో అమెరికాకు వెళ్లారు. అక్కడే స్థిరపడిన ఆయన పలు కంపెనీలు స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించారు. వీరి స్వస్థల౦ ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామ౦. సొ౦త ఊరి బాగు కోసం ముందుకు వచ్చారు. రూ.4లక్షలు సొంత డబ్బులు వెచ్చించి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. తాను చదివిన జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో విద్యార్థులకు ఐదేళ్లపాటు మినరల్‌ వాటర్‌ను సొంత ఖర్చులతో సరఫరా చేయించిన ఆయన ఇప్పుడు స్కూల్‌లోనే వాటర్‌ప్లాంట్‌ను ఏర్పాటు చేయించారు. అక్కడ వంట గది నిర్మించారు.

పలు దేవాలయాల పునఃనిర్మాణానికి ఆర్థిక సాయం అందించారు. సుబ్బారావు సతీమణి శ్రీదేవి తన స్వగ్రామమైన ఎన్నూరులో నూ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తాను నిర్వహించే స్వే చ్ఛ ఫౌండేషన్‌ ద్వారా బోర్లు తవ్వించడంతోపాటు విద్యార్థులకు దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు.