Kanna vs Laxman: ఆ విషయంలో కన్నా కంటే లక్ష్మణే లక్కీ!

తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల్లో లక్ష్మణ్‌కు సాధ్యమైనదేంటి? కన్నా లక్ష్మీనారాయణకు సాధ్యం కానిదేంటి? ఈ చర్చ ఇపుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.

Kanna vs Laxman: ఆ విషయంలో కన్నా కంటే లక్ష్మణే లక్కీ!
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 18, 2020 | 6:19 PM

There are many more rumors on changing AP BJP president: ఏపీ బీజేపీ కొత్త సారథి ఎవరు? కన్నానే కొనసాగిస్తారా? లేదా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేస్తారా? అనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. క్యాస్ట్‌ ఈక్వేషన్స్‌, పొలిటికల్‌ లెక్కలు చూస్తే మాత్రం కొత్త నేతను తెరపైకి తేవాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోందట. కొత్త ఓటు బ్యాంక్‌ను తయారుచేసే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉందట. ఇంతకీ కమలం నేతల ప్లానేంటి?

బీజేపీలో సంస్థాగత ఎన్నికలు ముగిశాయి. జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా వచ్చారు. ఒక్కో రాష్ట్రానికి కొత్త అధ్యక్షులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో తెలుగు రాష్ట్రాలకు కొత్త బీజేపీ అధ్యక్షులు వస్తారని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు నియమిస్తారు? అనే చర్చ నిన్న మొన్నటివరకూ జరిగింది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్‌ను మరోసారి కొనసాగించే అవకాశం ఉందనేది కమలం నేతల మాట. లక్ష్మణ్‌, బండి సంజయ్‌ మధ్య ప్రెసిడెంట్‌ వార్‌ నడుస్తోంది. అయితే అధిష్టానం మాత్రం లక్ష్మణ్‌ను మరోసారి కొనసాగించే అవకాశం ఉందట.

ఏపీ అధ్యక్షుడిగా ఎవరు వస్తారనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు రెన్యువల్‌ అవకాశం లేదని టాక్‌ విన్పిస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో పురందేశ్వరికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం అలోచిస్తోందట. ప్రతిపక్షంను వీక్‌ చేయాలనే ఎత్తుగడలో భాగంగా ఆమెకు పగ్గాలు ఇస్తారని ప్రచారం ఉంది. అయితే ఆమె అధ్యక్ష పదవిని తీసుకునేందుకు రెడీగా లేరని తెలుస్తోంది. తనకు ఏదైనా ఇతర పదవి ఇస్తే పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని అంటున్నారట.

Also read: KCR directions to newly elected municipal chairmen & mayors

బీసీ వర్గాలను అకట్టుకునేందుకు బీసీ నేత,ఉత్తరాంధ్రలో కీలక సామాజికవర్గం కొప్పుల వెలమకు చెందిన ఎమ్మెల్సీ మాధవ్‌కు అధ్యక్ష బాధ్యతలు అప్పగించే చాన్స్‌ ఉందట. బీసీ వర్గాన్ని ఆకట్టుకునేందుకు ఈ ఎత్తుగడ వేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణకు లైన్‌ క్లియర్‌ కాదని తెలుస్తోంది. ఆయన్ని రెండోసారి కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో అధిష్టానం ఆలోచిస్తోందట. పలు సామాజిక సమీకరణాలు, ప్రతిపక్ష పార్టీల ఓటుబ్యాంక్‌ను గుప్పిట్లోకి తీసుకునే లెక్కలు వేస్తోందట. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారని మాత్రం తెలుస్తోంది.