పాకిస్తాన్‌కు షాక్ ! బ్లాక్ లిస్టులో చేర్చిన అంతర్జాతీయ సంస్థ ?

టెర్రరిస్టులు ఉగ్రవాద సంస్థలకు నిధుల అందజేతను అడ్డుకునేందుకు, మనీ లాండరింగ్ కు చెక్ చెప్పేందుకు ఉద్దేశించిన పారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏ‌టీ‌ఎఫ్) పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో  పెట్టినట్టు వార్తలు అందుతున్నాయి. తమ దేశాల్లో ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు పాక్, ఇరాన్ తదితర దేశాలు పాటించిన విధానాలపై సమీక్ష జరిపేందుకు ఈ అంతర్జాతీయ సంస్థ ఆరు రోజులపాటు సమావేశమవుతోంది. ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి సంబంధించి ఈ సంస్థ నిర్దేశించిన 27 అంశాల్లో.. పహారింటికి అనువుగా […]

పాకిస్తాన్‌కు షాక్ ! బ్లాక్ లిస్టులో చేర్చిన అంతర్జాతీయ సంస్థ ?
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 18, 2020 | 6:13 PM

టెర్రరిస్టులు ఉగ్రవాద సంస్థలకు నిధుల అందజేతను అడ్డుకునేందుకు, మనీ లాండరింగ్ కు చెక్ చెప్పేందుకు ఉద్దేశించిన పారిస్ లోని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏ‌టీ‌ఎఫ్) పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్టులో  పెట్టినట్టు వార్తలు అందుతున్నాయి.

తమ దేశాల్లో ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు పాక్, ఇరాన్ తదితర దేశాలు పాటించిన విధానాలపై సమీక్ష జరిపేందుకు ఈ అంతర్జాతీయ సంస్థ ఆరు రోజులపాటు సమావేశమవుతోంది. ఉగ్రవాద కార్యకలాపాల కట్టడికి సంబంధించి ఈ సంస్థ నిర్దేశించిన 27 అంశాల్లో.. పహారింటికి అనువుగా తాము చర్యలు తీసుకున్నామని పాక్ వెల్లడించింది. అయితే వీటి పట్ల ఈ సంస్థ సంతృప్తి చెందలేదని తెలుస్తోంది. కాగా-జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ పైన, లష్కరే తోయిబా లీడర్ జకీ-ఉర్-రెహమాన్ లక్వీ మీద కఠిన చర్యలు తీసుకోవాలని భారత్.. పాక్‌ను కోరింది. ఇదే విషయాన్ని ఎఫ్‌ఏ‌టీ‌ఎఫ్ దృష్టికి కూడా తెచ్చింది. ఇండియా .. పాకిస్థాన్ ఇలా కోరడం ఇదే మొదటిసారి కాదు.