Pawan Kalyan: దాదాపు 20 సంవత్సరాల తర్వాత పవన్‌తో భూమిక?
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఖుషీ' సినిమాను ఏ తెలుగు ప్రేక్షకుడూ మరిచిపోలేడు. ముఖ్యంగా అందులోని 'భూమిక నల్ల చీర కట్టుకుని..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘ఖుషీ’ సినిమాను ఏ తెలుగు ప్రేక్షకుడూ మరిచిపోలేడు. ముఖ్యంగా అందులోని ‘భూమిక నల్ల చీర కట్టుకుని.. చదువుతూ ఉండగా.. వచ్చే సన్నివేశం, ‘నువ్వు చూశావ్’ అనే డైలాగ్స్ కానీ.. ఇప్పటికి కూడా గుర్తొస్తాయి. అంతలా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరిగిపోని ముద్ర వేసింది. ఖుషీ సినిమాలోని సాంగ్స్, మ్యూజిక్ కూడా ఇప్పటికీ ఫ్రెష్‌గానే అనిపిస్తాయి. ఈ సినిమాలోని భూమిక, పవన్‌ల యాక్టింగ్ ఎప్పటికీ గుర్తిండిపోతుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి మళ్లీ విరిద్దరూ కలిసి నటించింది లేదు. అయితే ఇప్పుడు మళ్లీ ఈ జోడీ స్విల్వర్ స్క్రీన్‌పై కనిపించనున్నారట. తాజాగా.. బాలీవుడ్ మూవీ ‘పింక్’ రీమేక్‌లో నటిస్తున్నారు పవన్. ఇప్పటికే పవన్ ఈ సినిమా షూటింగ్ సైలెంట్‌గా చేసేస్తున్నారు. ఇక ఆ తర్వాత క్రిష్ డైరెక్షన్‌లో పవన్ రెండో సినిమా చేయబోతున్నారనే టాక్ వైరల్ అవుతోంది. ఇది 2021 సంక్రాంతికి విడుదల చేయాలనే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నారట. అలాగే ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రూపొందుతుందని అలాగే ఇతర భాషల్లోనూ ఈ సినిమాని విడుదల చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే.. ఖుషీ సినిమా హిట్ పెయిర్ అయిన భూమిక, పవన్ కలిసి ఈ సినిమాలో నటించనున్నారని.. ఓ టాక్ ఫిల్మ్ వర్గాల్లో ట్రోల్ అవుతోంది. పవన్ సినిమాలో ఒక హీరోయిన్‌గా భూమిక కనిపించనుందట. అలాగే మరో ఇద్దరు హీరోయిన్లు కూడా క్రిష్ సినిమాలో నటించనున్నారని టాక్. ఇక ఆ తరువాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు.