Mahesh Babu: కథ చెప్పిన దర్శకుడు.. అల్లు అరవింద్‌ను కలవాలన్న మహేష్..!

టాలీవుడ్‌లో అల్లు, ఘట్టమనేని ఫ్యామిలీల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో విడుదల తేదీల విషయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్‌ల మధ్య మొదలైన కోల్డ్‌వార్.. ఇప్పటికీ సాగుతున్నట్లు పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అరవింద్ నిర్మాణంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం యశ్‌తో కేజీఎఫ్ 2ను తెరకెక్కిస్తోన్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ను టాలీవుడ్‌లోకి తీసుకువచ్చేందుకు ఇక్కడి నిర్మాతలు […]

Mahesh Babu: కథ చెప్పిన దర్శకుడు.. అల్లు అరవింద్‌ను కలవాలన్న మహేష్..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 18, 2020 | 2:17 PM

టాలీవుడ్‌లో అల్లు, ఘట్టమనేని ఫ్యామిలీల మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో విడుదల తేదీల విషయంలో మహేష్ బాబు, అల్లు అర్జున్‌ల మధ్య మొదలైన కోల్డ్‌వార్.. ఇప్పటికీ సాగుతున్నట్లు పుకార్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అరవింద్ నిర్మాణంలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం యశ్‌తో కేజీఎఫ్ 2ను తెరకెక్కిస్తోన్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ను టాలీవుడ్‌లోకి తీసుకువచ్చేందుకు ఇక్కడి నిర్మాతలు ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. అందునా టాలీవుడ్‌ మార్కెట్‌ కూడా ఎక్కువగా ఉండటంతో.. ప్రశాంత్ నీల్ సైతం ఇక్కడి హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల మహేష్‌కు ఓ స్టోరీని చెప్పాడట ప్రశాంత్. కథను విన్న మహేష్ ఓకే చెప్పి, ఈ స్టోరీని అల్లు అరవింద్‌కు కూడా వినిపించాలని అన్నారట. దీంతో త్వరలోనే మెగా ప్రొడ్యూసర్‌ను కలిసి కథ చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారట ప్రశాంత్. ఒకవేళ ఈ కథ అల్లు అరవింద్‌కు కూడా నచ్చితే.. వంశీ పైడిపల్లి మూవీ తరువాత ఈ కాంబోలో ప్రాజెక్ట్‌ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆయనకు నచ్చకపోతే మరో నిర్మాతతో మహేష్ సెట్స్ మీదకు వెళ్తారేమో చూడాలి.

అయితే మహేష్‌తో సినిమాను తీసేందుకు అల్లు అరవింద్ ఎప్పటినుంచో ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబుతో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ తెరకెక్కించే సినిమాను అల్లు అరవింద్ ప్రొడ్యూస్ చేయనున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. కానీ సందీప్ బాలీవుడ్‌కు వెళ్లడంతో ఈ ప్రాజెక్ట్ కాస్త వాయిదా పడింది. ఇదిలా ఉంటే ప్రశాంత్ నీల్‌లో ఓ సినిమాను నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ కూడా ప్లాన్ చేస్తోన్న విషయం తెలిసిందే.