Breaking News
  • భద్రాద్రి: పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లో భూప్రకంపనలు. టీచర్స్‌కాలనీ, బొడ్డుగూడెం, గట్టాయిగూడెం కాలనీల్లో భూప్రకంపనలు. అంజనాపురం, లక్ష్మీపురం, టేకులచెరువులో భూప్రకంపనలు. భయాందోళనలో స్థానికులు.
  • హైదరాబాద్‌: నగరంలో మంత్రి తలసాని పర్యటన. నిర్విరామంగా విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. పోలీసులు, వైద్య సిబ్బందికి గులాబీ పూలు ఇచ్చి అభినందించిన తలసాని. ఎనర్జీ డ్రింక్‌, మంచినీళ్లు, శానిటైజర్లు అందజేసిన మంత్రి తలసాని. రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కలుసుకుంటూ.. హైదరాబాద్‌లో పర్యటిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.
  • కరోనా వైరస్‌ను ఏపీ ప్రభుత్వం లైట్‌గా తీసుకుంటుంది. విపత్తు సాయం, నిత్యావసర సరుకుల పంపిణీని.. రాజకీయ ప్రచారం కోసం వాడుకుంటున్నారు-విష్ణువర్ధన్‌రెడ్డి. వైసీపీ నేతలకు సహకరిస్తున్న అధికారులను తొలగించాలి. ఏపీలో కరోనా కేసులు పెరగడానికి కారణం అంజాద్‌బాషా, ముస్తాఫానే. తక్షణమే అంజాద్‌బాషా తన పదవికి రాజీనామా చేయాలి -ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి.c
  • కరోనాపై మనమంతా కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిద్దాం. రా.9 గంటలకు దీపాలు వెలిగించి కరోనా చీకట్లను పారద్రోలడంతో పాటు.. భారతీయులమంతా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేస్తున్నామని చాటిచెబుదాం. ఈ ప్రయత్నం ద్వారా కరోనాపై పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న.. వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి సంఘీభావాన్ని తెలుపుదాం. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనాపై పోరాటాన్ని ఇదే స్ఫూర్తితో కొనసాగిద్దాం -ట్విట్టర్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • రైతు చెంతకే వెళ్లి ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం-కన్నబాబు. గ్రామ సచివాలయ వాలంటీర్లకు సమాచారం ఇస్తే.. ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తాం-మంత్రి కన్నబాబు. టమోటా, అరటిని మార్కెటింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తున్నాం. ధర పడిపోయిన చోట్ల ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సీఎం ఆదేశించారు. మామిడి ధరలు పడిపోకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. పంట దిగుబడుల క్యాలెండర్‌ను రూపొందిస్తున్నాం-మంత్రి కన్నబాబు. టీడీపీ నేతలు కరోనాను కూడా రాజయకీయంగా వాడుకుంటున్నారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకోండి-మంత్రి కన్నబాబు.

KCR new directions: కొత్త లీడర్లకు కేసీఆర్ డైరెక్షన్స్ ఇవే

ఇటీవల జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన ఛైర్మెన్లు, మేయర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. ప్రగతి భవన్‌లో కొత్తగా గెలిచిన వారితో భేటీ అయ్యారు. ఈభేటీ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ప్రతినిధులు దూరంగా వున్నారు.
kcr directions to new representatives, KCR new directions: కొత్త లీడర్లకు కేసీఆర్ డైరెక్షన్స్ ఇవే

Telangana CM KCR directed newly elected public representatives of Municipalities: తెలంగాణలో ఇటీవల మునిసిపాలిటీలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు. గెలిచామని కళ్ళు నెత్తికెక్కితే జనం చేతిలో దెబ్బతింటారని హెచ్చరించారు. సొయి తప్పి ప్రవర్తిస్తే అంతే సంగతులంటూ వార్నింగిచ్చారు సీఎం.

kcr directions to new representatives, KCR new directions: కొత్త లీడర్లకు కేసీఆర్ డైరెక్షన్స్ ఇవే

‘‘అధికారం, హోదా వచ్చినాక మనిషి మారకూడదు.. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దు.. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చింది..విధి నిర్వహణలో విఫలం కావద్దు.. పదవి అసిధారావ్రతం కత్తిమీద సాము లాంటిది..’’ అంటూ కేసీఆర్ మునిసిపల్ విజేతలకు హితవు పలికారు. మంగళవారం మునిసిపల్ ఛైర్మెన్లు, కార్పొరేషన్ మేయర్లతో హైదరాబాద్ ప్రగతిభవన్‌లో సీఎం భేటీ అయ్యారు. తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయని, ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నటువంటివని, బ్రిటిష్ వారి వలస పాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయని వివరించారు కేసీఆర్. మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడామని, ప్రజలు తనను రెండు సార్లు సిఎం చేశారని కేసీఆర్ అన్నారు.

kcr directions to new representatives, KCR new directions: కొత్త లీడర్లకు కేసీఆర్ డైరెక్షన్స్ ఇవే

మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారిందని, అవినీతికి మారుపేరు అయింది. బల్దియా .. ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయని… ఆ అభిప్రాయాన్ని మార్చాల్సిన బాధ్యత కొత్తగా గెలిచిన వారి మీద వుందని కేసీఆర్ చెప్పారు. ‘‘ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు..అన్ని పనులు ఓవర్ నైట్‌లో చేసేస్తాం అని మాట్లాడవద్దు.. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ వేసుకోవాలి.. మంచి అవగాహన ఏర్పరచుకోవాలి.. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలి.. అందరినీ కలుపుకుని పోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలి..’’ అంటూ ప్రజా ప్రతినిధులకు హితబోధ చేశారు.

Also read: Telugu Desam Party Praja Chytanya Yatra highlights

Related Tags