Salary account: శాలరీ అకౌంట్‌తో ఎన్నో లాభాలు.. అవేంటో తెలుసా..?
Salary account: ఈ రోజుల్లో సంస్థ యజమాని, ఉద్యోగి సొంతంగా కార్పొరేట్ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండడం మాములే. బ్యాంకులు రుణాల దగ్గరి నుంచి క్రెడిట్ కార్డుల వరకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. శాలరీ అకౌంట్ సేవలు కూడా ఇందులో భాగంగానే చెప్పుకోవచ్చు. శాలరీ అకౌంట్ అనేది కూడా ఒకరకమైన బ్యాంక్ అకౌంట్. ఉద్యోగి తీసుకునే జీతం ఈ అకౌంట్‌లో క్రెడిట్ అవుతూ వస్తుంది. బ్యాంకులు కేవలం కంపెనీల రిక్వెస్ట్ మేరకే శాలరీ అకౌంట్‌ను ఓపెన్ […]
Salary account: ఈ రోజుల్లో సంస్థ యజమాని, ఉద్యోగి సొంతంగా కార్పొరేట్ బ్యాంకు ఖాతాలను కలిగి ఉండడం మాములే. బ్యాంకులు రుణాల దగ్గరి నుంచి క్రెడిట్ కార్డుల వరకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. శాలరీ అకౌంట్ సేవలు కూడా ఇందులో భాగంగానే చెప్పుకోవచ్చు. శాలరీ అకౌంట్ అనేది కూడా ఒకరకమైన బ్యాంక్ అకౌంట్. ఉద్యోగి తీసుకునే జీతం ఈ అకౌంట్‌లో క్రెడిట్ అవుతూ వస్తుంది. బ్యాంకులు కేవలం కంపెనీల రిక్వెస్ట్ మేరకే శాలరీ అకౌంట్‌ను ఓపెన్ చేస్తాయి. ఉద్యోగి వేతనం ఈ శాలరీ అకౌంట్ ద్వారానే వారికి చేరుతుంది.
ఇవి జీతాల చెల్లింపు, ఇతర ఆర్థిక లావాదేవీలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శాలరీ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే మీరు అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్‌ను మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాంటి చార్జీలు పడవు. బ్యాంకులు శాలరీ అకౌంట్‌పైన డెబిట్ కార్డును అందజేస్తాయి. అలాగే ఉద్యోగులు శాలరీ అకౌంట్‌పై సులభంగానే క్రెడిట్ కార్డు కూడా పొందొచ్చు. బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లకుండానే బ్యాంకింగ్ సేవలు పొందేందుకు వీలుగా బ్యాంక్ సదురు ఉద్యోగికి నెట్ బ్యాంకింగ్ సదుపాయాన్ని కూడా అందిస్తుంది. దీంతో ఆన్‌లైన్‌లోనే నగదు లావాదేవీలు నిర్వహించొచ్చు.
బ్యాంకులు శాలరీ అకౌంట్ కలిగిన వారికి వివిధ సేవలను అందిస్తున్నాయి. శాలరీ అకౌంట్ కలిగిన వారు ఇతర కస్టమర్లతో పోలిస్తే బ్యాంక్ నుంచి సులభంగానే రుణాలు పొందొచ్చు. వడ్డీ రేటులో రాయితీ వంటి ప్రయోజనం లభిస్తుంది. అలాగే ప్రిఅప్రూవ్డ్ రుణాలు కూడా పొందొచ్చు. శాలరీ అకౌంట్‌పై ఇన్సూరెన్స్ సేవలు కూడా పొందొచ్చు. మీ శాలరీ అకౌంట్ ప్రాతిపదికన యాక్సిడెంట్ డెత్, ఎయిర్ ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటివి లభిస్తాయి. అలాగే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుపై కూడా మోసపూరిత లావాదేవీలు జరిగితే వారికి కూడా ఇన్సూరెన్స్ కవరేజ్ లభిస్తుంది.
కాగా.. కొన్ని బ్యాంకులు వారి కస్టమర్లకు శాలరీ అకౌంట్‌పై డీమ్యాట్ అకౌంట్ సేవలు కూడా అందిస్తున్నాయి. డీమ్యాట్ అకౌంట్ ద్వారా స్టాక్ మార్కెట్‌లో ట్రేడ్ చేయొచ్చు. శాలరీ అకౌంట్ ఉన్న వారికి, ఇతర సేవింగ్స్ ఖాతా ఉన్న కస్టమర్లకు క్యాష్ విత్‌డ్రా సేవల్లో కొంత వ్యత్యాసం ఉండొచ్చు. శాలరీ అకౌంట్ కలిగిన వారికి విత్‌డ్రా లిమిట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.