TRS Party: గులాబీ దళంలో సహకార రచ్చరచ్చ

అన్ని ఎన్నికల్లోను వరుసగా విజయం సాధిస్తూ వస్తున్న టీఆర్ఎస్ పార్టీలో సహకార పదవులు రగడ సృష్టిస్తున్నాయి. అనుచరులకే సహకార పోస్టులు ఇప్పించుకునే పరిస్థితి నెలకొన్ని నేపథ్యంలో పదవులు ఇప్పించుకోలేని వారు అంతర్గత పోరాటానికి తెరలేపారు

TRS Party: గులాబీ దళంలో సహకార రచ్చరచ్చ
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 18, 2020 | 7:03 PM

Internal war between few TRS leaders: సహకార ఎన్నికల కోసం గులాబీ దళంలో రచ్చరచ్చ జరుగుతోంది. ఛైర్మన్‌ల పదవి కోసం పోటాపోటీగా నేతలు పోటీ పడ్డారు. తమ అనుచరులకు పదవులు ఇవ్వడంతో ఇతర వర్గం అలకబాట పట్టింది. దీంతో ఇప్పుడు డిసిసిబిల కోసం నేతలు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. దీంతో ఈ సారి ఎవరిని అదృష్టం వరిస్తుందో అనే టెన్షన్ నేతల్లో నెలకొంది.

ప్రాథ‌మిక‌ వ్యవసాయ స‌హ‌కార సంఘాల ప‌ద‌వులు అధికార పార్టీ ఎమ్మెల్యేల‌కు త‌ల‌నొప్పిగా మారాయి. ఈ నెల 15న జ‌రిగిన ఎన్నిక‌ల్లో దాదాపు అన్ని సంఘాల‌ను టిఆర్ఎస్ పార్టీ మ‌ద్దతుదారులే గెలుచుకున్నారు. అయితే అన్ని స్థానాల‌ను గెలిచిన సంబ‌రం కూడ ఎమ్మెల్యేల‌కు లేకుండా పోయింది. సొసైటీల ఛైర్మన్‌ ఎన్నిక‌కు వ‌చ్చే వ‌ర‌కు పెద్ద యుద్ధమే జ‌రిగింద‌ని చెప్పుకోవ‌చ్చు. ప‌ద‌వులు అశించి భంగ‌ప‌డ్డ నేత‌లు దాడుల‌కు సైతం వెనుకాడడం లేదు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల‌రాజుపై అమ్రాబాద్‌లో దాడి జ‌రిగి త‌ల‌కు గాయం కూడా అయింది. అటూ అర్మూర్‌లో అశించిన వ్యకి కాకుండా వేరే వారికి ప‌ద‌వి ఇచ్చారు అని సొంత పార్టీ నేత‌లే అర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి బొమ్మతో శవయాత్ర నిర్వహించారు.

ఇక వ్యవ‌సాయ స‌హ‌కార సంఘాల ఎన్నిక‌లు సొంత పార్టీ ఎమ్మెల్యేల మ‌ధ్య కూడ కోల్డ్ వార్‌కు దారి తీసింది. నిజ‌మాబాద్ టౌన్ ఎమ్మెల్యే గ‌ణేష్ బిగాల తండ్రి ప‌ద‌వి విష‌యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డికి, గ‌ణేష్ బిగాల‌కు మ‌ధ్య ఇంట‌ర్నల్‌ వార్ కూడా న‌డిచింది. గ‌ణేష్ బిగాల తండ్రి కృష్ణ మూర్తి అర్మూర్ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని మాక్లూరు వ్యవసాయ స‌హ‌కార సంఘంలో డైరెక్టర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్‌ ప‌ద‌వి అశించారు. అయితే వేరే వారికి ఛైర్మన్‌ పదవి ఇవ్వడంతో జీవన్‌రెడ్డిపై గణేష్‌ బిగాల గుర్రుగా ఉన్నారు.

Also read: T.BJP president Laxman is luckier than AP BJP president Kanna

ఇక డిసిసిబి పదవుల విషయంలో కూడా నేతల మధ్య పోటాపోటీ నెలకొంది. ఆశించిన పదవులు రాకపోతే నేతలు ఎలా రియాక్ట్‌ అవుతారో అనే భయం ఎమ్మెల్యేల్లో నెలకొంది.