“ఎగ్జామ్స్ లేకుండా డిగ్రీలు ఇచ్చే ప్రసక్తే లేదు”
కరోనా ప్రభావం అన్ని రంగాలపై స్పష్టంగా కనిపిస్తోంది. మహమ్మారి దెబ్బకు ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. వైరస్ నియంత్రణకు మందు లేకపోవడంతో ప్రపంచదేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో సర్వం స్థంభించిపోయింది. ముఖ్యంగా మార్చి-ఏప్రిల్ కావడంతో విద్యావ్యవస్థపై కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని పరీక్షలు పూర్తైయినప్పటికీ..మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే…న్యూ అకాడమిక్ ఇయర్‌పై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి. కరోనా కారణంగా కొంత ఆలస్యం అయినా ఇంజనీరింగ్‌తో […]

కరోనా ప్రభావం అన్ని రంగాలపై స్పష్టంగా కనిపిస్తోంది. మహమ్మారి దెబ్బకు ప్రపంచదేశాలు అల్లాడుతున్నాయి. వైరస్ నియంత్రణకు మందు లేకపోవడంతో ప్రపంచదేశాలు లాక్‌డౌన్ ప్రకటించాయి. దీంతో సర్వం స్థంభించిపోయింది. ముఖ్యంగా మార్చి-ఏప్రిల్ కావడంతో విద్యావ్యవస్థపై కరోనా ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. కొన్ని పరీక్షలు పూర్తైయినప్పటికీ..మరికొన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. అయితే…న్యూ అకాడమిక్ ఇయర్‌పై విద్యార్ధులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి.
కరోనా కారణంగా కొంత ఆలస్యం అయినా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు ఎగ్జామ్స్ నిర్వహిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జామ్స్ లేకుండా డిగ్రీలు ఇచ్చే ప్రసక్తేలేదంటున్నారు ప్రొఫెసర్ పాపిరెడ్డి. మరోవైపు కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం, ఫైనల్ ఇయర్ విద్యార్దులకు పరీక్షల నిర్వహణపై ఎంహెచ్‌ఆర్‌డీ రెండు కమిటీలు వేసిందని చెప్పారు. ఆ కమిటీలు నివేదిక కుడా సమర్పించాయన్నారు. త్వరలోనే నిర్ణయం వెలువడుతుందంటున్నారు తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి.




