లాలూకి కరోనా ఫియర్..ఆ ఆస్పత్రిలో ఏం జరిగిందంటే..
ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ట్రీట్మెంట్ తీసుకుంటోన్న ఆసుపత్రిలో ఓ రోగికి కరోనా సోకడం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన రోగికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఉమేష్ ప్రసాదే.. లాలూకు కూడా వైద్య సేవలందిస్తున్నారు. వివరాల ప్రకారం రిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి సోమవారం రాత్రి కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతడిని కోవిడ్-19 ట్రీట్మెంట్ సెంటర్ కు తరలించారు. వెంటనే అలర్టయిన డాక్టర్లు.. ఇప్పటికే […]
ఆర్జేడీ నేత, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ట్రీట్మెంట్ తీసుకుంటోన్న ఆసుపత్రిలో ఓ రోగికి కరోనా సోకడం టెన్షన్ క్రియేట్ చేస్తోంది. కొవిడ్ పాజిటివ్ వచ్చిన రోగికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఉమేష్ ప్రసాదే.. లాలూకు కూడా వైద్య సేవలందిస్తున్నారు.
వివరాల ప్రకారం రిమ్స్ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి సోమవారం రాత్రి కరోనా పాజిటివ్ అని తేలింది. వెంటనే అతడిని కోవిడ్-19 ట్రీట్మెంట్ సెంటర్ కు తరలించారు. వెంటనే అలర్టయిన డాక్టర్లు.. ఇప్పటికే లాలూకు ట్రీట్మెంట్ అందిస్తోన్న డాక్టర్ ఉమేష్ టీమ్ లోని వైద్యులందరినీ క్వారంటైన్‌కు పంపించారు. కరోనా టెస్టుల కోసం వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. డాక్టర్స్ టీమ్ లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే.. లాలూకు కూడా టెస్టులు నిర్వహిస్తామని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. దాణా కుంభకోణం కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న లాలూ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఝార్ఖండ్ రాంచీ నగరంలోని రాజేంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లోని పేయింగ్ వార్డులో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.