వీళ్లు చనిపోయినప్పుడు.. గుర్తుకు రాలేదా మానవహక్కులు..! దిశ పేరంట్స్ ఫైర్
‘దిశ’ హత్యాచార కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం.. ప్రపంచవ్యాప్తంగా.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన జరిగిన.. అతి తక్కువ వ్యవధిలోనే.. ఎన్‌కౌంటర్ జరగడం అనేది ఊహించని విషయం. అయితే… ఈ ఎన్‌కౌంటర్ ఘటనను ఎన్‌హెచ్‌ఆర్సీ కమిటీ తప్పుపట్టింది. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని.. వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై దిశ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేరస్తులు చనిపోతే.. మానవ హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందన్నారు. మరి మా కూతురు చనిపోయినప్పుడు మానవ హక్కుల […]
‘దిశ’ హత్యాచార కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం.. ప్రపంచవ్యాప్తంగా.. అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటన జరిగిన.. అతి తక్కువ వ్యవధిలోనే.. ఎన్‌కౌంటర్ జరగడం అనేది ఊహించని విషయం. అయితే… ఈ ఎన్‌కౌంటర్ ఘటనను ఎన్‌హెచ్‌ఆర్సీ కమిటీ తప్పుపట్టింది. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకూడదని.. వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలపై దిశ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేరస్తులు చనిపోతే.. మానవ హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందన్నారు.
మరి మా కూతురు చనిపోయినప్పుడు మానవ హక్కుల సంఘం ఎందుకు స్పందించలేదు? గ్యాంగ్ రేప్ చేసి.. కాల్చినప్పుడు మానవ హక్కుల ఉల్లంఘన జరగలేదా..? నేరస్తులు చనిపోతేనే మానవహక్కుల ఉల్లంఘన ఎలా అవుతుంది..? హాజీపూర్ ఘటన, వరంగల్లో 9 నెలల చిన్నారిపై రేప్ అండ్ మర్డర్, ఆసిఫాబాద్‌లో అత్యాచారం, హత్యలపై ఎన్‌హెచ్‌ఆర్సీ ఎందుకు నోరు మెదపలేదంటూ వారు ఎన్‌హెచ్‌ఆర్సీని ప్రశ్నించారు. ఈ ఎన్‌కౌంటర్ సమాజమే కోరుకుందని.. ఇలాగైతేనే అన్యాయం జరిగిన వారికి సత్వర న్యాయం చేకూరుతుందని.. దిశ తల్లిదండ్రులు ఎన్‌హెచ్‌ఆర్సీపై మండిపడ్డారు.