బిగ్‌న్యూస్: డబుల్ సెంచరీకి చేరువలో ఉల్లి ధర..!

డబుల్ సెంచరీకి చేరువగా ఉల్లి పరుగులు పెడుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో.. ప్రజలు తలలు బాదుకుంటుంటే.. ఇప్పుడు ఈ వార్త వారిని మరింత షాక్‌కు గురిచేస్తోంది. అయితే.. తిరుపతిలో.. కిలో ఉల్లి ధర రూ.180లకు చేరువయ్యి.. మరో రికార్డును సృష్టించింది. దీంతో.. రైతు బజార్లలో ఉల్లి అమ్మకాలను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. రైతు బజార్లలో మొన్నటివరకూ.. రోజు విడిచి రోజు.. రూ.25 రూపాయలకే కిలో ఉల్లి అమ్మకాలను నిర్వహించిన.. మార్కెటింగ్ నిర్వాహకులు.. ఇప్పుడు మొత్తంగా అమ్మకాలను ఆపేశారు. […]

బిగ్‌న్యూస్: డబుల్ సెంచరీకి చేరువలో ఉల్లి ధర..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 1:41 PM

డబుల్ సెంచరీకి చేరువగా ఉల్లి పరుగులు పెడుతోంది. ఇప్పటికే పెరిగిన ధరలతో.. ప్రజలు తలలు బాదుకుంటుంటే.. ఇప్పుడు ఈ వార్త వారిని మరింత షాక్‌కు గురిచేస్తోంది. అయితే.. తిరుపతిలో.. కిలో ఉల్లి ధర రూ.180లకు చేరువయ్యి.. మరో రికార్డును సృష్టించింది. దీంతో.. రైతు బజార్లలో ఉల్లి అమ్మకాలను ఏపీ ప్రభుత్వం నిలిపివేసింది. రైతు బజార్లలో మొన్నటివరకూ.. రోజు విడిచి రోజు.. రూ.25 రూపాయలకే కిలో ఉల్లి అమ్మకాలను నిర్వహించిన.. మార్కెటింగ్ నిర్వాహకులు.. ఇప్పుడు మొత్తంగా అమ్మకాలను ఆపేశారు. ఇప్పటికే  ప్రభుత్వం క్వింటాలు దాదాపు రూ.13 వేలకు  కొనుగోలు చేసి.. రాయితీ ద్వారా.. ప్రజలకు 25 రూపాయలకి అందిస్తోంది. ఇప్పుడు ఉల్లి నిల్వ లేక.. అందులోనూ పెరుగుతున్న ధరలతో.. ఉల్లిని రాయితీ ద్వారా అందించలేమని చేతులెత్తేసింది ప్రభుత్వం. ఉల్లి నిల్వలు మరీ తగ్గడంతో.. రిటైల్ మార్కెట్‌లో.. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకూ.. కేజీ 175 రూపాయలు ధర.. ఆల్‌టైం హై రికార్డును సాధించిందనుకున్నా.. ఇప్పుడు 180కి చేరి మరో రికార్డును సృష్టిస్తుంది.

కాగా.. ఏపీలోని మరికొన్ని ప్రాంతాల్లో.. సబ్సిడీ ఉల్లి కోసం రైతు బజార్‌ వద్ద జనం పడిగాపులు కాస్తున్నారు. కిలో మీటర్ల మేర క్యూలు పెరిగిపోతున్నాయి. దీంతో.. క్యూలైన్‌లో ఉన్న జనాలు.. స్పృహ తప్పి పడిపోతున్నారు. ప్రభుత్వం సరిపడా ఉల్లి సరఫరా చేయడం లేదంటూ వినియోగదారులు ఆందోళన చేస్తున్నారు.