వివేకా హత్యకేసులో అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగుస్తుందా?
వైఎస్ వివేకా హత్యకేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. నేడో, రేపో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకానున్నారు. అలాగే.. సోమవారం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా.. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డితో పాటు.. ఎమ్మెల్సీ బీటెక్ రవి, నారాయణ రెడ్డిని సిట్.. విచారణ జరిపింది. అయితే.. వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగిసుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే […]
వైఎస్ వివేకా హత్యకేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. నేడో, రేపో వైసీపీ కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిట్ విచారణకు హాజరుకానున్నారు. అలాగే.. సోమవారం మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా.. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డితో పాటు.. ఎమ్మెల్సీ బీటెక్ రవి, నారాయణ రెడ్డిని సిట్.. విచారణ జరిపింది.
అయితే.. వివేకా హత్య కేసులో.. ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు ఉచ్చు బిగిసుకునేలా కనిపిస్తోంది. ఇప్పటికే సిట్.. 1300 మందిని ప్రశ్నించింది. ఇన్ని జరిగినా.. ఆయన కేసులో అసలు నిందితులు ఎవరనేది ఇంకా బయటకు రాలేదు. కాగా.. ఈ కేసులో.. అవినాష్ ప్రధాన సాక్షిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో.. అవినాష్ రెడ్డి చెప్పే సాక్ష్యం కూడా కీలకంగా మారే అవకాశం ఉంది. గతంలో.. పులివెందులలో ఒక సారి ఆయన్ని సిట్ విచారించిన విషయం తెలిసిందే. ముందు వివేకాకు గుండెపోటని ఎందుకు చెప్పారు..? ఆ తర్వాత హత్య జరిగిందని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటూ.. ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ కేసులో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు కూడా జరిగినట్టు అనుమానాలున్నాయి. అదే ప్రధానంగా విచారించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా.. హత్య జరిగి.. ఇప్పటికి 8 నెలలు కావొస్తుంది అయినా.. ఈ కేసు ముందుకు సాగడం లేదు.
2019 ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్య.. రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ముందు గుండెపోటు అని భావించినా.. పోస్ట్ మార్డమ్ రిపోర్టులో అది హత్యగా తేలింది. అప్పటి ఏపీ ప్రభుత్వం ఈ హత్య కేసుపై సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే.. వివేకా హత్య కేసులో ప్రధాన అనుమానితులైన ప్రకాష్, శ్రీనివాస్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి ముగ్గురూ.. బెయిల్‌పై విడుదల అయ్యారు. కాగా.. వీరిలో శ్రీనివాస్ రెడ్డి అనే అతను ఆత్మహత్య చేసుకుని మరణించాడు.