పాక్ ఎయిర్ లైన్స్ సిబ్బందికి షాక్.. వెయ్యి మంది తొలగింపు

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం.. ఆ సంస్థ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఒకే సారి వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విమానసంస్థ ఖర్చులు తగ్గించేందుకు పాక్ ఎయిర్ లైన్స్ కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఈ సంస్థ సీఈవో ఎయిర్ మార్షల్ అర్షద్ మాలిక్ ఈ విషయాన్ని ఆర్థిక సలహాదారైన ప్రధాని డాక్టర్ అబ్దుల్ హఫీజ్ షేక్‌ కి తెలియజేశారు. ఉద్యోగులపై వెచ్చించే వేతనాలు తగ్గించి.. సంస్థకు వచ్చే ఆదాయాన్ని […]

పాక్ ఎయిర్ లైన్స్ సిబ్బందికి షాక్.. వెయ్యి మంది తొలగింపు
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2019 | 10:58 AM

పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ యాజమాన్యం.. ఆ సంస్థ ఉద్యోగులకు భారీ షాకిచ్చింది. ఒకే సారి వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విమానసంస్థ ఖర్చులు తగ్గించేందుకు పాక్ ఎయిర్ లైన్స్ కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఈ సంస్థ సీఈవో ఎయిర్ మార్షల్ అర్షద్ మాలిక్ ఈ విషయాన్ని ఆర్థిక సలహాదారైన ప్రధాని డాక్టర్ అబ్దుల్ హఫీజ్ షేక్‌ కి తెలియజేశారు. ఉద్యోగులపై వెచ్చించే వేతనాలు తగ్గించి.. సంస్థకు వచ్చే ఆదాయాన్ని పెంచే దిశగా పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ పాటించాల‌ని పాక్ ఎయిర్‌లైన్స్‌కు ప్ర‌భుత్వం గట్టిగా ఆదేశించింది. ఖ‌ర్చులు త‌గ్గించే నేప‌థ్యంలోనే సిబ్బందిని తొలగించినట్లు ఆ సంస్థ సీఈవో మాలిక్ తెలిపారు.