రాజకీయాలకు పనికిరానంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే రాజీనామా!

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే సోమవారం రాత్రి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే తను రాజకీయాలకు పనికిరానంటూ తేల్చిచెప్పారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మజల్‌గావ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సోలాంకే, తన ఆకస్మిక నిర్ణయానికి.. రాష్ట్ర క్యాబినెట్‌లో చోటుదక్కకపోవడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. “నేను మంగళవారం రాజీనామా చేయబోతున్నాను, ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటాను” అని సోలాంకే చెప్పారు. తన పార్టీలోని ఏ […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:42 pm, Tue, 31 December 19
రాజకీయాలకు పనికిరానంటూ ఎన్సీపీ ఎమ్మెల్యే రాజీనామా!

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే సోమవారం రాత్రి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎందుకంటే తను రాజకీయాలకు పనికిరానంటూ తేల్చిచెప్పారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మజల్‌గావ్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన సోలాంకే, తన ఆకస్మిక నిర్ణయానికి.. రాష్ట్ర క్యాబినెట్‌లో చోటుదక్కకపోవడానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. “నేను మంగళవారం రాజీనామా చేయబోతున్నాను, ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటాను” అని సోలాంకే చెప్పారు. తన పార్టీలోని ఏ నాయకుడిపైనా అసంతృప్తి లేదని ఎమ్మెల్యే అన్నారు.

పదవీవిరమణ చేయాలనే నా నిర్ణయం గురించి నేను ఎన్‌సిపి నాయకులకు తెలియజేసాను. నా రాజీనామాకు కేబినెట్ విస్తరణకు ఎలాంటి సంబంధం లేదు” అని ఆయన స్పష్టం చేశారు. 288 మంది సభ్యుల అసెంబ్లీలో, 56 మంది సభ్యులను కలిగి ఉన్న శివసేన తరువాత ఎన్‌సిపికి 54 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.