AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహంత్ స్వామి మహారాజ్ 92వ జన్మదినం.. దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ

బిఎపిఎస్ స్వామినారాయణ సంస్థ ఆధ్యాత్మిక అధిపతి మహంత్ స్వామి మహారాజ్ 92వ జన్మదినం పురస్కరించుకుని సోమవారం వడోదరలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం వేదికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు మహంత్ స్వామి మహారాజ్‌ను గౌరవ ధృవీకరణ పత్రంతో సత్కరిస్తారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో దాదాపు రెండు లక్షల మంది భక్తులు సామూహిక హారతి నిర్వహించి అరుదైన దృశ్యాన్ని సృష్టించారు.

మహంత్ స్వామి మహారాజ్ 92వ జన్మదినం.. దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ
Mahant Swami Maharajs
Jyothi Gadda
|

Updated on: Feb 04, 2026 | 11:13 AM

Share

వడోదరలో మహంత్ స్వామి మహారాజ్ 92వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆయన దివ్య జీవితం, ఆధ్యాత్మిక ఔన్నత్యం, మానవాళి సంక్షేమం కోసం చేసిన కృషిని కొనియాడారు. బిఎపిఎస్ స్వామినారాయణ సంస్థ ఆధ్యాత్మిక అధిపతి మహంత్ స్వామి మహారాజ్ 92వ జన్మదినం పురస్కరించుకుని వడోదరలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమం వేదికగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారులు మహంత్ స్వామి మహారాజ్‌ను గౌరవ ధృవీకరణ పత్రంతో సత్కరిస్తారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో దాదాపు రెండు లక్షల మంది భక్తులు సామూహిక హారతి నిర్వహించి అరుదైన దృశ్యాన్ని సృష్టించారు.

మహంత్ మహారాజ్‌ పుట్టిన రోజు పండుగ సందర్భంగా ఆయన మాటలు, ప్రభావం, అహంకారం లేకపోవడం, ఉన్నత ఆధ్యాత్మిక స్థితిని ప్రదర్శించే ప్రత్యేక వీడియో ప్రదర్శించారు. BAPS లోని సీనియర్ సాధువులు ఆయన దివ్య జీవితం, లక్షణాలు, పనులపై స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ BAPS స్వామినారాయణ సంస్థ గౌరవనీయ నాయకుడు మహంత్ స్వామి మహారాజ్ 92వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఫడ్నవీస్, మహంత్ స్వామి మహారాజ్‌తో కలిసి ఉన్న ఫోటోను తన X హ్యాండిల్‌లో షేర్‌ చేశారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సైతం మహంత్ స్వామి మహారాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా మహంత్ స్వామి మహారాజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన తన ట్విట్టర్‌ వేదికగా ఈ విషేస్‌ తెలియజేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..