AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu : ఒక్క సీన్ కోసం 3 నెలలు.. రన్నింగ్ కు 6 నెలలు ట్రైనింగ్.. జక్కన్నపై మహేష్ బాబు కామెం్స్..

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎదురుచూస్తున్న సినిమా వారణాసి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ మూవీపై ఆసక్తికర కామెంట్స్ చేశారు మహేష్.

Mahesh Babu : ఒక్క సీన్ కోసం 3 నెలలు.. రన్నింగ్ కు 6 నెలలు ట్రైనింగ్.. జక్కన్నపై మహేష్ బాబు కామెం్స్..
Mahesh Babu
Rajitha Chanti
|

Updated on: Feb 04, 2026 | 10:51 AM

Share

మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో వారణాసి ఒకటి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి అద్బుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదివరకే విడుదలైన గ్లింప్స్ ఓ రేంజ్ హైప్ పెంచేసింది. తాజాగా ఈ మూవీ టీమ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విశేషాలను పంచుకుంది. ఈ చిత్రంలోని వారి పాత్రల దగ్గర నుంచి కథ ఎలా స్టార్ట్ అయ్యిందని అనే విషయాలను సూపర్ స్టా్ర్ మహేష్ పంచుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..

వారణాసి సినిమా స్క్రిప్ట్ గురించి రాజమౌళి తనకు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానని అన్నారు మహేష్. ఇప్పటివరకు జక్కన్న చేసిన అన్ని చిత్రాల కంటే ఇది భిన్నంగా ఉంటుందని.. ఇందులో ఎన్నో అంశాలు ఉన్నాయని.. యాక్షన్, అడ్వెంచర్, పురాణాలు, టైమ్ ట్రావెల్.. ఇలా ఎన్నో కథలు ఉన్నాయని అన్నారు. రాజమౌళి అభిమానిగా ఈ మూవీ కోసం తాను ఎదురుచూస్తున్నానని అన్నారు. ఇందులో హీరోగా చేయడానికి మొదట్లో భయపడ్డానని.. రాజమౌళి కథను వివరించిన విధానం తన భయాన్ని పోగొట్టిందని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి: Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్‏ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..

వారణాసి సినిమాలో లుక్స్ కోసం ఎన్నో రిహార్సల్స్ చేశామని.. 2024 నుంచి ఆ పనిలోనే ఉన్నామని అన్నారు. గతేడాది జర్మనీ కూడా వెళ్లామని.. రాజమౌళి ప్రతి చిన్న విషయాన్ని క్షుణంగా పరిశీలిస్తారని.. ఎన్నిసార్లు అయినా రిహార్సల్స్ చేయిస్తారని అన్నారు. ఈ చిత్రంలో తాను రాముడి పాత్రలో కనిపిస్తానని.. రాముడు అంటేనే హుందాతనం.. ఆయనకు ప్రత్యేకమైన భంగిమ ఉంటుంది.. నిలబడే విధానం నుంచి పాత్రలో నటించడం వరకు ఎన్నో రిహార్సల్స్ చేశారని చెప్పుకొచ్చారు. దాదాపు 2,3 నెలలు దానికోసమే కష్టపడ్డామని.. రాజమౌళి పరిగెత్తే విధానాన్ని కూడా మార్చారని.. అందుకు దాదాపు 6 నెలలు శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. ఎన్నో వర్క్ షాప్స్.. మరెన్నో యూరోపియన్ శిల్పాలు పరిశీలించారని గుర్తుచేసుకున్నారు.

ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్

ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీ‏రోయిన్‏ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..