తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సమీప గ్రామాల్లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దివాన్ చెరువు గ్రామం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలోని జాతీయ రహదారిపై పెద్దపులి తిరుగుతూ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు సూచించారు.