AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పథకం

ఏపీ సహా 4 రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కోసం పథకం

Phani CH
|

Updated on: Feb 03, 2026 | 12:03 PM

Share

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో ఖనిజ వనరులు, ముఖ్యంగా రేర్ ఎర్త్ మినరల్స్ కోసం నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ మిషన్ ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చారు. సెమీకండక్టర్ ఇండియా మిషన్ 2.0కి రూ.40 వేల కోట్లు కేటాయించారు. MSMEలు, విద్య, ఫార్మా రంగాల్లో కొత్త సంస్థలు, మౌలిక సదుపాయాలకు భారీ నిధులు, జౌళీ రంగ విస్తరణకు చర్యలు ప్రకటించారు. దేశాభివృద్ధికి కీలక కేటాయింపులు.

కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తొమ్మిదోసారి పార్లమెంటులో 2026-27 ఆర్ధిక బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. ఇందులో భాగంగా ఖనిజ వనరులున్న రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. రేర్‌ ఎర్త్‌ మినరల్స్‌ కోసం 4 రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ మేరకు బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్న నిర్మల..ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ప్రత్యేక మైనింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేస్తామన్నారు. తీర ప్రాంత రాష్ట్రాలపై దృష్టి సారిస్తామన్న మంత్రి ప్రపంచస్థాయి కంటెయినర్‌ ఉత్పత్తి కార్పొరేషన్‌ నెలకొల్పుతామని వెల్లడించారు. ఈ సందర్భంగా ఫార్మా, విద్య, పరిశోధనకు జాతీయ స్థాయిలో 3 కొత్త విద్యా సంస్థల స్థాపనకు నిర్ణయించినట్లు తెలిపారు. ఛాంపియన్ ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. సెమీ కండక్టర్ ఇండియా మిషన్ 2.0 కోసం రూ.40 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలో కొత్తగా మూడు రసాయన పార్కుల స్థాపన, ప్రపంచస్థాయి కంటెయినర్ ఉత్పత్తి కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. జౌళీ రంగ విస్తరణ, అధునీకీకరణ, ఉపాధి దిశగా మరిన్ని అడుగులు వేస్తున్నామని నిర్మలా సీతారామన్ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మన జౌళీ ఉత్పత్తుల అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం ప్రత్యేక కార్యాచరణ, మెగా టెక్స్‌టైల్స్ పార్కులు, పరిశ్రమలకు విద్యా సంస్థల అనుసంధానం వంటి వాటిని తన ప్రసంగంలో పేర్కొన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆలయంలో నాగుపాము.. భక్తుల్లో భయం

విద్యార్థులకు బిగ్ రిలీఫ్.. స్కూల్‌లోనే అంతా..

బాబోయ్‌ పులి.. ఎమ్మెల్యే బుచ్చయ్య ముందునుంచే వెళ్లి

సైలెంట్ కిల్లర్స్‌గా ఇయర్‌ఫోన్స్.. అతిగా వాడితే వచ్చే సమస్యలు ఇవే

నడిరోడ్డుపై యువకుడికి క్లాస్‌ తీసుకున్న మంత్రి