AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆహా.. ఏమి అందం..! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము.. ఏం చేసిందో చూస్తే..

పాములు కూడా తమ అందాన్ని చూసి గర్వపడతాయా..? వినడానికి చాలా వింతగా ఉంది కదూ..! కానీ, ఇక్కడ ఒక పాము అద్దంలో చూసుకుంటూ ఏం చేసిందో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు..ఒక పెద్ద నల్లటి సర్పం ఒకటి నిలువెత్తు అద్దం ముందు సినిమా స్టైల్లో ఫోజులిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అదేంటో మనం కూడా చూసేద్దాం....

ఆహా.. ఏమి అందం..! అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన పాము.. ఏం చేసిందో చూస్తే..
Snake Dance In Front Of Mirror
Jyothi Gadda
|

Updated on: Feb 04, 2026 | 8:01 AM

Share

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియో వైరల్‌ అవుతుందో ఎవరూ చెప్పలేరు..కానీ, పాములకు సంబంధించిన వీడియోలు మాత్రం ఎప్పుడైనా సరైనా ట్రెండింగ్‌లోనే ఉంటున్నాయి. స్నేక్‌ వీడియోలు అంటే నెటిజన్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ సారి కూడా అలాంటిదే ఒక భారీ సర్పానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ అరుదైన దృశ్యాన్ని స్నేక్‌ క్యాచర్‌ కళ్యాణ్ రాజ్ గైకర్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ @snakefriend_raj ద్వారా షేర్‌ చేశారు. . ఈ వీడియోకు ఇప్పటివరకు 1.7 మిలియన్లకు పైగా వ్యూస్‌, 59,000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

ఈ వైరల్ వీడియో ఒక ఇంటి లోపలి దృశ్యం. ఇందులో ఒక పెద్ద అద్దం ఎదురుగా నల్లటి రంగులో ఉన్న భారీ పాముతో ప్రారంభమవుతుంది. మొదట, అది ప్రశాంతంగా తనను తాను చూసుకుంటుంది. కానీ,ఆ మరుసటి క్షణం అది అద్భుతమైన నృత్యం చేస్తున్నట్లుగా గాలిలో ఊగడం ప్రారంభిస్తుంది.

ఇవి కూడా చదవండి

వీడియోను నిశితంగా పరిశీలిస్తే ఇది నృత్యం కాదని, ప్రాదేశిక పోరాటం అని తెలుస్తుంది. పాము అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని తన ప్రత్యర్థి పాము అని భావించింది. వెంటనే అది తన నాలుకను చాచి అద్దం దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. కానీ, దానికి ఎదురుగా ఉన్న పాము కూడా అదే చేస్తున్నట్లు గ్రహించి, వెంటనే వెనక్కి తగ్గుతుంది.

ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని, నవ్వును ఆపుకోలేకపోతున్నారు. ఇది చూసిన ఒక యూజర్ ఇలా అన్నాడు.. పాము అనుకుంటుందట.. నేను ఎందుకు అంత అందంగా ఉన్నాను?’ అని ఆలోచిస్తున్నట్లు అనిపిస్తోందని, మరొక యూజర్ ఇలా అన్నాడు, ఆ పాము దానికి సరైన జోడీ దొరికిందని అనుకుందని రాశాడు. మరో వ్యక్తి సరదాగా స్పందిస్తూ.. పాము మనిషి కంటే బాగా పోజులిచ్చిందని రాశాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇకపై భోగాపురం gg
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇకపై భోగాపురం gg
మీరు రోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతారా.. కిడ్నీలకు ఏం జరుగుతుందో..
మీరు రోజూ నిమ్మకాయ నీళ్లు తాగుతారా.. కిడ్నీలకు ఏం జరుగుతుందో..
ఈ టాలీవుడ్ హీరో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 52 ఏళ్ల వయసులో స్టిల్ సింగిల్..
APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు
APPSC గ్రూప్ 2 పూర్తి నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచే దరఖాస్తు
6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ..
6 దశాబ్దాల ప్రస్థానం.. ప్రపంచానికి తెలియని కథ.. సోనియా గాంధీ..
దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో పిచ్చి ట్రెండింగ్..
దృశ్యం మూవీని మించిన ట్విస్టులు.. ఓటీటీలో పిచ్చి ట్రెండింగ్..
ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..
ఈ ఒక్క పని చేయకపోతే డబ్బులు కట్.. కేంద్రం అలర్ట్..