ఈ ముద్దుగుమ్మ ఆశలు తెలుగులో గల్లంతేయినట్టేనా..?

Rajeev 

3 February 2026

 రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజా సాబ్ సినిమాతో టాలీవుడ్ లోకి నేరుగా అడుగుపెట్టింది అందాల ముద్దుగుమ్మ మాళవిక మోహనన్.

మొన్నటివరకు తమిళ్, మలయాళంలో సినిమాలు చేసిన ఈ అందాల భామ ఇప్పుడు తెలుగులోకి అడుగుపెట్టింది.

పట్టంపోలే సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్ సరసన నటించి మెప్పించింది.

మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ బ్యూటీకి ఆఫర్స్ క్యూ కట్టాయి.

ఆ తర్వాత తమిళం, మలయాళం భాషలలో వరుసగా సినిమాలు చేసి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది.

కానీ మొన్నటివరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ డబ్బింగ్ సినిమాలతోనే ఫేమస్ అయ్యింది.

ఇక ఇటీవల విడుదలైన రాజాసాబ్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఈ బ్యూటీ ఆశలు గల్లంతయ్యాయి.