AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi: బాబర్ ఆజాంకే గురిపెట్టాడుగా.. ఈ టీమిండియా సెన్సేషన్ స్కెచ్ అదుర్స్..

Vaibhav Suryavanshi in U19 World Cup: అండర్ 19 ప్రపంచకప్ లో భారత జట్టు దంచి కొడుతోంది. ఈ క్రమంలో ఆఫ్ఘానిస్తాన్ జట్టుతో సెమీస్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో టీమిండియా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఓ భారీ రికార్డ్ బ్రేక్ చేసేందుకు ఛాన్స్ ఉంది.

Vaibhav Suryavanshi: బాబర్ ఆజాంకే గురిపెట్టాడుగా.. ఈ టీమిండియా సెన్సేషన్ స్కెచ్ అదుర్స్..
Vaibhav Suryavanshi
Venkata Chari
|

Updated on: Feb 04, 2026 | 11:11 AM

Share

Vaibhav Suryavanshi in U19 World Cup: అండర్-19 ప్రపంచ కప్‌లో భారత జట్టు దూసుకెళ్తోంది. అయితే, ఐపీఎల్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ మాత్రం ఫ్యాన్స్ కు అసలైన్ ట్రీట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. మొత్తంగా వైభవ్ సూర్యవంశీ ఈ టోర్నమెంట్‌లో 39.20 సగటుతో కేవలం 196 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. అయితే, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సెమీ-ఫైనల్‌లో నంబర్ 1 బ్యాటర్ నిలిచే అవకాశం ఉంది. ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటే ఈ యంగ్ ప్లేయర్ నంబర్ 1 అవ్వడమే కాకుండా, పాకిస్తాన్‌కు చెందిన బాబర్ అజామ్ రికార్డును కూడా బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది.

లక్కీ ఛాన్స్..

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే సెమీఫైనల్‌లో వైభవ్ సూర్యవంశీ ఈ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోవాలంటే భారీ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. దీంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెంచరీ కూడా వస్తుందన్నమాట. ఇలా చేస్తే బాబర్ ఆజం రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీంతో అండర్-19 వన్డేల్లో యాక్టివ్ ప్లేయర్లలో నంబర్ 1 ఆల్-టైమ్ లీడింగ్ రన్-స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి: Team India: అభిషేక్, సూర్య కాదు భయ్యో.. టీ20 ప్రపంచకప్ లో విదేశీ బౌలర్ల పాలిట విలన్‌గా ‘ఛోటా ప్యాకెట్’

వైభవ్ సూర్యవంశీ ‘మిషన్ 93’..

అండర్-19 వన్డేల్లో యాక్టివ్‌గా ఉన్న ఆటగాళ్లలో, బంగ్లాదేశ్‌కు చెందిన అజీజుల్ హకీమ్ 37 మ్యాచ్‌ల్లో 35 ఇన్నింగ్స్‌ల్లో 1,261 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన రికార్డును కలిగి ఉన్నాడు. ఈ బంగ్లా ప్లేయర్ సగటు 42.03, స్ట్రైక్ రేట్ 74.79గా ఉంది. ఆ తర్వాత 23 మ్యాచ్‌ల్లో 23 ఇన్నింగ్స్‌ల్లో 1,169 పరుగులు చేసిన వైభవ్ సూర్యవంశీ రెండవ స్థానంలో నిలిచాడు. వైభవ్ సగటు 50.82, స్ట్రైక్ రేట్ 158.18గా ఉంది. ఇది అండర్-19 వన్డే హిస్టరీలో ఏ బ్యాట్స్‌మన్‌కైనా అత్యధికం కావడం విశేషం.

ఇది కూడా చదవండి: PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు.. ఆ రెండు దేశాల మద్దతుతో పాక్ దూకుడు..?

బంగ్లాదేశ్ టోర్నమెంట్ నుంచి తప్పుకుంది. దీంతో వైభవ్ సూర్యవంశీ అండర్-19 వన్డేలలో నంబర్ 1 యాక్టివ్ ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్‌కు చెందిన అజీజుల్ హకీమ్‌ను అధిగమించి నంబర్ 1 ఆటగాడిగా నిలిచాడు. ఇందుకోసం సెమీ-ఫైనల్‌లో వైభవ్ 93 పరుగులు చేయాల్సి ఉంటుంది.

వైభవ్ సూర్యవంశీ సెంచరీ సాధిస్తే, యాక్టివ్ ప్లేయర్లలో నంబర్ 1 అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడమే కాదు.. బాబర్ అజామ్ రికార్డును బద్దలు కొట్టగలడు. బాబర్ అజామ్ 36 అండర్-19 వన్డేల్లో 35 ఇన్నింగ్స్‌ల్లో 1271 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ కాలంలో, సగటు 38.51, స్ట్రైక్ రేట్ 73.85గా ఉంది. అంటే పరుగుల పరంగా బాబర్ అజామ్‌ను అధిగమించడానికి వైభవ్ సూర్యవంశీకి 103 పరుగులు అవసరం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ
ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పోను ప్రారంభించిన ప్రధాని మోదీ
మహా శివరాత్రి వేడుకలు.. భక్తి పాటలకు హీరోయిన్ల స్టెప్పులు..వీడియో
మహా శివరాత్రి వేడుకలు.. భక్తి పాటలకు హీరోయిన్ల స్టెప్పులు..వీడియో
SIP Vs PPF.. ఏ ప్లాన్ ఎవరికి సరైనది?.. పూర్తి వివరాలు ఇవే!
SIP Vs PPF.. ఏ ప్లాన్ ఎవరికి సరైనది?.. పూర్తి వివరాలు ఇవే!
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? పంజాబ్ గబ్బర్ ఫామ్ పోయిందా ?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌కు ఏమైంది? పంజాబ్ గబ్బర్ ఫామ్ పోయిందా ?
చింతలమోరి శివాలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు
చింతలమోరి శివాలయంలో వైభవంగా శివరాత్రి వేడుకలు
వారికి ఈ ప్రయోజనాలు వర్తించవా? వాస్తవం ఏంటంటే..?
వారికి ఈ ప్రయోజనాలు వర్తించవా? వాస్తవం ఏంటంటే..?
బార్బీలు ఎవరు?.. ఈ బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎందుకు?
బార్బీలు ఎవరు?.. ఈ బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ఇంత క్రేజ్ ఎందుకు?
ఫిబ్రవరి 17న రాహుగ్రస్త సూర్యగ్రహణం... భారత్‌పై ఎఫెక్ట్‌ ఎంత
ఫిబ్రవరి 17న రాహుగ్రస్త సూర్యగ్రహణం... భారత్‌పై ఎఫెక్ట్‌ ఎంత
పొరపాటున కూడా వీటిని కాకరకాయలతో కలిపి తినకండి.. లేదంటే
పొరపాటున కూడా వీటిని కాకరకాయలతో కలిపి తినకండి.. లేదంటే
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్‌ లింక్ ఇదే
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్‌ లింక్ ఇదే