జనగామ జిల్లాలో పులి సంచారం కలకలం రేపుతోంది. పెంబర్తి, సిద్ధంకి, బచ్చన్నపేట మండలాల్లో అటవీ శాఖ పులి పాదముద్రలను గుర్తించింది. ఒక లేగదూడపై దాడి చేసి పులి చంపేసింది. రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పశువులను అడవికి సమీపంలో కట్టేయవద్దని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. పులిని గమనిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.