AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సప్‌కు సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్

వాట్సప్‌కు సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వినియోగదారుల డేటాను వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించుకోవడానికి అనుమతించాలని కోరుతూ వేసిన పిటిషన్‌పై సీరియస్ అయింది. దేశ పౌరుల డేటాను దోపిడీ చేసే చర్యలకు తాము అనుమించేదే లేదని తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగదని స్పష్టం చేసింది.

WhatsApp: దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సప్‌కు సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
Whatsapp
Venkatrao Lella
|

Updated on: Feb 03, 2026 | 1:33 PM

Share

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజ సంస్ధ మోటా, వాట్సాప్‌కు సుప్రీంకోర్టు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వాట్సప్ గోపత్యా విధానంపై మోటాను హెచ్చరించింది. నిబంధనలు పాటించకపోతే భారతదేశం నుంచి వెళ్లిపోవచ్చంటూ సీరియస్ అయింది. వాట్సప్ గోప్యతా విధానం 2021కి సంబంధించిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ సూర్య నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా తమ దేశ ప్రజల గోప్యతో మీరు ఆటలాడుకోలేరని, తమ డేటాలో ఒక్క అంకెను కూడా మీరు పంచుకోవడానికి అనుమతించేలేది లేదని తేల్చేసింది. భారతీయుల డేటాను దోపిడీ చేయడానికి కుదరదని, అవసరమైతే భారత్ నుంచి వెళ్లిపోవచ్చంటూ సుప్రీంకోర్టు సీరియస్ అయింది. నిబంధనలు పాటించనందుకు కంపెనీ లాం ట్రిబ్యునల్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించిన రూ.213 కోట్ల జరిమానాను అత్యున్నత ధర్మాసనం సమర్థించింది.

దేశం విడిచి వెళ్లిపొవచ్చు

పిటిషన్‌పై విచారణ సందర్భంగా ప్రభుత్వ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మోహతా వాదనలు వినిపించారు. వ్యాపార ప్రకటనల కోసం వినియోగదారుడి డేటాను వాట్సప్ ఇతరులతో పంచుకోవడం దోపిడీగా విమర్శించారు. దీంతో ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. తమ రాజ్యాంగాన్ని అనుసరించకపోతే దేశం విడిచి వెళ్లిపోవచ్చని, పౌరుల గోప్యతకు భంగం కలిగించే పనులు చేయడానికి తాము అనుమతించేది లేదని హెచ్చరించారు. కొన్నిసార్లు మీ విధానాలను అర్థం చేసుకోవడంలో కూడా తమకు ఇబ్బంది ఉంటుందని, దేశంలోని లక్షలాది పేదలు, చదువురాని ప్రజలు వీటిని అర్థం చేసుకోగలరా అంటూ ప్రశ్నించింది. పేద మహిళ లేదా రోడ్డు పక్కన వ్యాపారులు అర్థం చేసుకోగలరా అంటూ ప్రశ్నలు కురిపించింది.

ఎండ్ టూ ఎండ్ క్రిప్ట్

మోటా, వాట్సప్ తరపు తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. వాట్సప్‌లో అన్ని మెస్సేజ్‌లు ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేయబడి ఉన్నాయని, కంపెనీలు కూడా కంటెంట్‌ను చూడలేవంటూ తెలిపారు. కాగా తమ డేటాను షేర్ చేయడానికి అనుమతించాల్సిందిగా కొంతమంది వినియోగదారులకు వాట్సప్ బలవంతం చేస్తోంది. డేటా షేరింగ్‌ను అనుమతించాల్సిందిగా వినియోగదారులకు చెప్పడానినని సీసీఐ వ్యతిరేకించింది. దీంతో వాట్సప్‌కు జరిమానా విధించింది.దీనిని సవాల్ చేస్తూ 2025లో మోటా, వాట్సప్ సుప్రీంకోర్టును సంప్రదించాయి. ఈ క్రమంలో సీసీఐ నిర్ణయాన్ని సమర్ధించిన సుప్రీం.. వాట్సప్‌ యాజమాన్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.