AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి.. లేదంటే అయిపోతారు..!

మాంసాహారులకు కోడి మాంసం ప్రాణం. చికెన్ ఫ్రై, బిర్యానీ, సూప్.. ఇలా రకరకాల వంటకాలు తయారు చేసి ఆస్వాదిస్తారు. కానీ, మార్కెట్లో తక్కువ ధరలకు లభించే ఫామ్ చికెన్ మంచిదా? లేక గ్రామాల్లో సహజంగా పెరిగే నాటు కోడి మంచిదా? ఈ రెండింటిలో దేనిలో ఎక్కువ పోషకాలు ఉన్నాయి? ఈ ప్రశ్నకు వైద్యులు, పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు..ఆ హెల్త్‌ సీక్రెట్‌ ఏంటో ఇక్కడ చూద్దాం...

కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి.. లేదంటే అయిపోతారు..!
Broiler Chicken Vs Country
Jyothi Gadda
|

Updated on: Feb 04, 2026 | 8:28 AM

Share

చాలా మందికి చికెన్‌ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరిపోయేంత ఇష్టం ఉంటుంది. కానీ, మనం తినే కోడి మాంసం మన శరీరానికి బలాన్ని ఇస్తుందా లేదా వ్యాధులను తెస్తుందా..? అనేది మనం అర్థం చేసుకోవాలి.. కంట్రీ చికెన్, బ్రాయిలర్ మధ్య ఏది ఎక్కువ శక్తివంతమైనదో తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే.. బ్రాయిలర్ చికెన్ తక్కువ ధరకు లభిస్తుందని చాలా మంది కొంటారు. కానీ, వాటి పెంపకం వెనుక ఉన్న చేదు నిజం ఏమిటంటే అది మన ఆరోగ్యానికి హానికరం. బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరగడానికి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వాటిని అతిగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, తక్కువ రోగనిరోధక శక్తి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, వాటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.

దేశీ చికెన్.. పోషకాల గని: ప్రకృతి ఒడిలో పెరిగి సహజ ఆహారాన్ని తినే ఫ్రీ-రేంజ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. 100 గ్రాముల బ్రాయిలర్ చికెన్‌లో 150 కేలరీలు ఉండగా, ఫ్రీ-రేంజ్ చికెన్‌లో 120 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో చాలా తక్కువ కొవ్వు పదార్థం ఉంటుంది. ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఫ్రీ-రేంజ్ చికెన్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను నివారించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

నాటు కోడిలో ముఖ్యమైన పోషకాలు: నాటు కోడి మన శరీరానికి అవసరమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రోటీన్ కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. విటమిన్లు D, E, B-కాంప్లెక్స్ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. జింక్, సెలీనియం, ఇనుము రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

మేక మాంసం కంటే కోడి మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందించే నాటు కోడిని ఎంచుకోవడం మంచిది.

Follow Us
పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి
పార్లర్‌కు వెళ్లే పని లేదు.. ఇంట్లోనే ఈజీగాహెయిర్‌ స్పా చేసుకోండి
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
రెండో సూర్య గ్రహణం తర్వాత భారీ మార్పులు..
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
ఓటీటీని ఊపేస్తోన్న డార్క్ క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
నల్ల తాచునే గజగజ వణికించారుగా.. ఒళ్ళు గగుర్పొడిచే వైరల్ వీడియో..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
12 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!