చైనా దుందుడుకు చర్య, భారీ రాకెట్ ‘పతనం’పై నాసా ఆగ్రహం, బాధ్యతా రాహిత్య ప్రమాణాలకు మీదే బాధ్యత అంటూ విమర్శ

చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ మాల్దీవుల సమీపంలో హిందూ మహాసముద్రంలో కూలిపోయిన ఘటనపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తీవ్రంగా స్పందించింది.

చైనా దుందుడుకు చర్య, భారీ రాకెట్ 'పతనం'పై నాసా ఆగ్రహం, బాధ్యతా రాహిత్య ప్రమాణాలకు మీదే బాధ్యత అంటూ విమర్శ
Nasa Vs China
Follow us
Umakanth Rao

| Edited By: Rajitha Chanti

Updated on: May 09, 2021 | 8:50 PM

చైనాకు చెందిన లాంగ్ మార్చ్ 5 బీ రాకెట్ మాల్దీవుల సమీపంలో హిందూ మహాసముద్రంలో కూలిపోయిన ఘటనపై అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తీవ్రంగా స్పందించింది. మీవి బాధ్యతారాహిత్యమైన ప్రమాణాలని ఆరోపించింది. అంతరిక్ష ప్రమాణాలను పాటించడంలో చైనా విఫలమైందని ఆరోపించింది. ఈ రాకెట్ శిథిల భాగాలు భూవాతావరణంలోకి ఆదివారం ఉదయం చైనా కాలమానం ప్రకారం 10 గంటల 24 నిముషాలకు ప్రవేశించాయి. చివరకు ఈ రాకెట్ 72.47 డిగ్రీల తూర్పు లాంగిట్యూడ్ లోను, 2.65 డిగ్రీల ఉత్తర లాంగిట్యూడ్ లోనూ హిందూ మహాసముద్రంలో క్రాష్ అయింది. చైనా అంతరిక్ష కార్యక్రమాన్ని విమర్శించిన నాసా..అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ..చైనా తన రోదసీ ప్రమాణాలను పాటించలేకపోయిందన్నారు. అంతరిక్షాన్ని తమ ప్రయోజనాలకు వినియోగించుకోవాలనుకుంటున్న దేశాలు భూమిపై గల ప్రజలు, ఆస్తులకు రిస్క్ కలగకుండా చూసుకోవలసి ఉంటుందన్నారు. ఈ విధమైన ఆపరేషన్స్ లో అత్యంత జాగరూకత ఉండాలన్నారు.ఈయన మాజీ సెనెటర్, భవిష్యత్ వ్యోమగామి కూడా… చైనా అంతరిక్ష కార్యక్రమం ‘పస’ లేనిదిగా ఈయన అభిప్రాయపడ్డాడు. గత ఏప్రిల్ 29 న చైనా ఈ రాకెట్ ని ప్రయోగించింది. ఇది కక్ష్య నుంచి విడిపోయి ప్రపంచంలో ఎక్కడ పడుతుందో, ఎంత ప్రాణ, ఆస్థి నష్టం జరుగుతుందో అని అంతా భయపడ్డారు.చివరకు ఇది హిందూ మహాసముద్రంలో కూలిపోయింది. ఇలా ఉండగా ఈ రాకెట్ శిథిల భాగాల వల్ల ముప్పు కలుగుతుందన్న అభిప్రాయాన్ని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ కొట్టి పారేసింది. ఇది వెస్టర్న్ హైప్ అని ఎద్దేవా చేసింది. మేము ఏది తలపెట్టినా దాన్ని పాశ్చాత్య దేశాలు తేలిగ్గా తీసుకుంటాయని ఆరోపించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Telangana Covid-19: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే?

Beauty Tips: బయటకు వెళ్తున్నారా ? అయితే మీ బ్యాగ్‏లో తప్పనిసరిగా ఉండాల్సిన వస్తువులు ఇవే..