మన్యంలో వింతకాంతులు..కెమెరాకు కూడా చిక్కడం లేదు.. ఏమిటీ మిస్టరీ..?

ఎన్నడూ లేనిది మన్యంలో వింతకాంతులు కనబడుతున్నాయి. రాత్రి వేళ.. కళ్లు జిగేల్ మనేలా.. మెరుపుల్లా వెలుగులు వెదజల్లుతున్నాయి. ఈ మధ్య భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన అరుదైన వింత వాతావరణ ప్రభావమో మరేమో కానీ.. చెట్ల మీద పరుచుకుంటున్న ఈ కాంతులు.. స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు, ఆందోళనలకు గురిచేస్తున్నాయి. మన్యం అటవీ ప్రాంతం ఇలా ఒక్కసారిగా రాత్రివేళ పగలును తలపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగి, వాతంగి గ్రామాల మధ్య […]

మన్యంలో వింతకాంతులు..కెమెరాకు కూడా చిక్కడం లేదు.. ఏమిటీ మిస్టరీ..?
Follow us

| Edited By:

Updated on: Oct 08, 2019 | 4:19 PM

ఎన్నడూ లేనిది మన్యంలో వింతకాంతులు కనబడుతున్నాయి. రాత్రి వేళ.. కళ్లు జిగేల్ మనేలా.. మెరుపుల్లా వెలుగులు వెదజల్లుతున్నాయి. ఈ మధ్య భారీ వర్షాలు, ఉరుములు, పిడుగులతో కూడిన అరుదైన వింత వాతావరణ ప్రభావమో మరేమో కానీ.. చెట్ల మీద పరుచుకుంటున్న ఈ కాంతులు.. స్థానికులను సంభ్రమాశ్చర్యాలకు, ఆందోళనలకు గురిచేస్తున్నాయి. మన్యం అటవీ ప్రాంతం ఇలా ఒక్కసారిగా రాత్రివేళ పగలును తలపిస్తోంది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా మన్యం ప్రాంతంలోని రాజవొమ్మంగి మండలం జడ్డంగి, వాతంగి గ్రామాల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వింతకాంతులను చూసేందుకు గిరిజనులు తండోపతండాలుగా ప్రజలు తరలివచ్చారు. రాత్రి 11.30 నుంచి తెల్లవారు జాము వరకు ఈ వింతకాంతులు కనిపిస్తున్నాయి. అయితే వీటిని ఫోటో తీసేందుకు ఎంత ప్రయత్నించినా.. అవి కెమెరాకు చిక్కడం లేదని స్థానికులు చెబుతున్నారు. కాంతులు వచ్చిన చెట్ల వద్దకు వెళ్లిన ప్రజలు పరిశీలించి.. వాటి వద్ద పూజలు కూడా చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం రాత్రి ఆ ప్రాంతంలో పర్యటించారు. అయితే దుష్టశక్తుల ప్రభావమని పుకార్లు రావడంతో.. గ్రామాల్లో జ్వరాలు పెరిగిపోతాయని గిరిజనులు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే గతంలో కూడా ఇలా కాంతులు వచ్చాయని.. భయపడేది ఏం లేదని.. పోలీసులు ధైర్యం చెప్పారు.

భార్యకు గురక సమస్య ఉంటే! ఓటీటీలోకి డియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
భార్యకు గురక సమస్య ఉంటే! ఓటీటీలోకి డియర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
రెండో విడత పోలింగ్ ప్రశాంతం.. మూడో విడత ప్రచారానికి నేతలు సిద్దం
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మట్టిలో మెరుస్తూ కనిపించిన వస్తువు.. తవ్వి చూడగా బయటపడ్డ నిధి.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
మేకపాలు తాగితే ఎన్ని లాభాలో తెలుసా..? వారానికి ఒక్కసారైనా వాడితే.
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
కోహ్లీ, హార్దిక్‌కు నో ప్లేస్..T20 ప్రపంచకప్‌లో ఊహించని ప్లేయర్లు
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
శ్రీశైలంలో కనుల పండువగా భ్రమరాంబ దేవి వార్షిక కుంభోత్సవం
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..