అరబిందో ఫార్మాకు కొత్త తలనొప్పులు.. లోపాలను గుర్తించిన యూఎస్ ఎఫ్‌డీఏ
ప్రముఖ ఔషదరంగ సంస్ధ అరబిందో ఫార్మా హైదరాబాద్ బ్రాంచీకి కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. ఈ యూనిట్‌ను తనిఖీ చేసిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఐ) ఏడు లోపాలను గుర్తించి భారీ షాక్ ఇచ్చింది. దీంతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని గ్లెన్‌మార్క్ ఫార్మాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ కంపెనీల్లో అయిదో పెద్ద కంపెనీ అరబిందో ఫార్మా. దీని మెయిన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. దీనికి అమెరికా నుంచి […]
ప్రముఖ ఔషదరంగ సంస్ధ అరబిందో ఫార్మా హైదరాబాద్ బ్రాంచీకి కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. ఈ యూనిట్‌ను తనిఖీ చేసిన అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఐ) ఏడు లోపాలను గుర్తించి భారీ షాక్ ఇచ్చింది. దీంతో పాటు హిమాచల్ ప్రదేశ్‌లోని గ్లెన్‌మార్క్ ఫార్మాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. అమెరికాకు ఎగుమతి చేసే జనరిక్ కంపెనీల్లో అయిదో పెద్ద కంపెనీ అరబిందో ఫార్మా. దీని మెయిన్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది. దీనికి అమెరికా నుంచి 25 నుంచి 30 శాతం ఆదాయం వస్తుంది. అయితే యూఎస్ఎఫ్‌డీఏ షాక్ నేపథ్యంలో సోమవారం అరబిందో కంపెనీ షేర్లు ఐదేళ్ల కనిష్టానికి నష్టపోయాయి. దీనికి ప్రధాన కారణం గత నెలలో యూఎస్ఎఫ్‌డీఏ తనిఖీ చేసి ఏడు లోపాలను గుర్తించడమేనని బాంబే స్టాక్ ఎక్చేంజ్‌కు అరబిందో ఫార్మా తెలియజేసింది.
గత నెల సెప్టెంబర్ 19 వ తేదీ నుంచి 27 మధ్య యూఎస్ ఎఫ్‌డీఏ అధికారులు అరబిందో ఫార్మాలో తనిఖీలు నిర్వహించారు. దీనిలో ఏడు లోపాలను గుర్తించారు. వీటిలో ప్రధానంగా కంపెనీ తయారు చేసే ఔషధ ఉత్పత్తులకు సంబంధించినవే ఉన్నాయని తెలుస్తుంది. అయితే తమ కంపెనీపై వచ్చిన లోపాలను గుర్తించి వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని కంపెనీ అధికారులు తెలిపారు. సరిదిద్దిన తర్వాత మరోసారి యూఎస్ఎఫ్‌డీఏకు నివేదిక కూడా పంపిస్తామని అరబిందో ఫార్మా అధికారులు వెల్లడించారు.
సోమవారం జరిగిన ట్రేడింగ్‌లో అరబిందో ఫార్మా షేర్లు కంపెనీ షేర్లు 20శాతం నష్టపోయి రూ.458.50 వద్ద క్లోజ్ అయ్యాయి. దీంతో ఐదేళ్ల కనిష్టానికి చేరుకున్నట్టయ్యింది. ఈ పరిస్థితితో అరబిందో కంపెనీకి కొత్త చిక్కులు వచ్చినట్టయింది. ఎందుకంటే ప్రధానంగా అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తుల ద్వారా అరబిందో ఫార్మాకు 25 నుంచి 30 శాతం ఆదాయం లభిస్తుంది. ఒక్కసారి స్టాక్ మార్కెట్లో నష్టాలు రావడంతో కంపెనీ నష్ట నివారణ చర్యలు ప్రారంభించింది.