అరకు ఎంపీ మాధవి ప్రేమ కథ.. అచ్చు సినిమాలో లాగానే..!

స్కూల్ వయసులో కలిసి చదువుకున్నారు. కొద్ది రోజులకు వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. రోజులు గడిచే కొద్దీ ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమలో ఏ మాత్రం స్వార్థం చూసుకోని ఆ ఇద్దరు ఒకరి గెలుపుకు మరొకరు సాయపడ్డారు. ఇప్పుడు ఇద్దరు మంచి స్థానాల్లో ఉన్నారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇంతకు వారెవరు అనుకుంటున్నారా..! అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివ ప్రసాద్. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సీనియర్ […]

అరకు ఎంపీ మాధవి ప్రేమ కథ.. అచ్చు సినిమాలో లాగానే..!


స్కూల్ వయసులో కలిసి చదువుకున్నారు. కొద్ది రోజులకు వారిద్దరి మధ్య స్నేహం చిగురించింది. రోజులు గడిచే కొద్దీ ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఆ ప్రేమలో ఏ మాత్రం స్వార్థం చూసుకోని ఆ ఇద్దరు ఒకరి గెలుపుకు మరొకరు సాయపడ్డారు. ఇప్పుడు ఇద్దరు మంచి స్థానాల్లో ఉన్నారు. అంతేకాదు మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఇంతకు వారెవరు అనుకుంటున్నారా..! అరకు ఎంపీ గొడ్డేటి మాధవి, కుసిరెడ్డి శివ ప్రసాద్.

ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో సీనియర్ రాజకీయ నాయకుడు కిశోర్ చంద్రను ఓడించి.. భారీ మెజారిటీతో గెలిచి.. చిన్న వయసులోనే ఎంపీగా లోక్‌సభలో అడుగుపెట్టిన మాధవి వివాహం ఈ నెల 17న ఆమె స్వగ్రామం శరభన్నపాలెంలో జరగనున్న విషయం తెలిసిందే. ఆ తరువాత విశాఖలో ఈ ఇద్దరి రిసెప్షన్ జరగనుండగా.. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలుస్తోంది.

అయితే ఈ ఇద్దరు చిన్నప్పటి స్నేహితులు కావడం విశేషం. పదో తరగతిలో మాధవి, శివ ప్రసాద్‌ల మధ్య స్నేహం మొదలు కాగా.. ఎవరి దారిలో వారు ముందుకు సాగుతూ వచ్చారు. బీఎస్సీ బీఈడీ చేసిన మాధవి పీఈటీ టీచర్‌గా పనిచేస్తూ ఉండేది. శివ ప్రసాద్.. ఎస్‌టీ థెరిసా విద్యా సంస్థల కరస్పాండెంట్‌గా, శివ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఈ ఏడాది జరిగిన ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాధవి వచ్చారు. జగన్ సహకారంతో ఎంపీ సీటును కూడా దక్కించుకున్నారు. ఈ క్రమంలో శివ ప్రసాద్ ఆమె వెంట ఉన్నారు. మాధవి తరఫున ప్రచారం చేసి.. ఎంపీగా మాధవి గెలిచేందుకు తన వంతు కృషి చేశారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య ప్రేమ పెరుగుతూ వచ్చింది. దీంతో జీవితాంతం తోడుగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ఇక ఇరు కుటుంబాల పెద్దల ముందు తమ పెళ్లి విషయాన్ని బయటపెట్టారు. అయితే వీరి పెళ్లికి కులం అడ్డుపడింది. ఆ తర్వాత తర్వాత వీరి మనసును అర్థం చేసుకున్న పెద్దవాళ్లు.. పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆలస్యం చేయకుండా తమ పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నారు మాధవి, శివ ప్రసాద్.

ఈ నేపథ్యంలో మాధవి మాట్లాడుతూ.. శివ ప్రసాద్ తనను ఎంతగానో అర్థం చేసుకున్నాడని.. ఆయన తన జీవితంలోకి వస్తే బావుంటుందని భావించి.. ఆయన ప్రపోజల్‌కు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నానని చెప్పింది. ఇక శివ ప్రసాద్ కూడా మాట్లాడుతూ.. ఓ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అయినప్పటికీ.. మాధవిలో ఇసుమంత కూడా గర్వం ఉండదని.. ఆమెలోని ఆ తత్వం తనను ఎంతగానో ముగ్ధుడిని చేసిందని చెప్పుకొచ్చాడు.

Click on your DTH Provider to Add TV9 Telugu