AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ఎవర్రా నువ్వు.. ముంబై కొంప ఇలా ముంచేశావ్.. ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్..

Naman Dhir Dropped Catches: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వైఫల్యాల పరంపర కొనసాగుతోంది. కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే కాకుండా, అత్యంత దారుణమైన ఫీల్డింగ్ జట్టు కొంపముంచుతోంది. ముఖ్యంగా యువ ఆటగాడు నమన్ ధీర్ ఒకే సీజన్‌లో ఏడు క్యాచ్‌లు వదిలేసి అపఖ్యాతి పాలయ్యాడు. చేతుల్లోకి వచ్చిన బంతులను జారవిడుస్తూ ప్రత్యర్థి బ్యాటర్లకు ప్రాణదానం చేయడం ముంబై ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది.

IPL 2026: ఎవర్రా నువ్వు.. ముంబై కొంప ఇలా ముంచేశావ్.. ఐపీఎల్ హిస్టరీలోనే చెత్త రికార్డ్..
Naman Dhir Dropped Catches
Venkata Chari
|

Updated on: May 14, 2026 | 9:32 PM

Share

Naman Dhir Dropped Catches: పంజాబ్ కింగ్స్‌తో జరిగిన 58వ మ్యాచ్‌లో ముంబై ఫీల్డర్ నమన్ ధీర్ మరోసారి చేతులెత్తేశాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో స్లిప్‌లో నిలబడ్డ నమన్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. ఈ అద్భుతమైన అవకాశాన్ని జారవిడచడంతో బౌలర్ బుమ్రా తీవ్ర అసహనానికి లోనయ్యాడు. ఆ సమయంలో కేవలం స్వల్ప స్కోర్‌కే అవుట్ కావాల్సిన ప్రభ్‌సిమ్రాన్, లభించిన జీవదానంతో చెలరేగిపోయి 57 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

అత్యధిక క్యాచ్‌లు జారవిడిచిన ‘అన్ లక్కీ’ రికార్డు..

ఈ సీజన్‌లో నమన్ ధీర్ ఫీల్డింగ్ ముంబైకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇప్పటివరకు అతను మొత్తం ఏడు క్యాచ్‌లను జారవిడిచి, ఒకే సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు వదిలేసిన ఆటగాడిగా అవాంఛిత రికార్డును మూటగట్టుకున్నాడు. కేవలం నమన్ మాత్రమే కాదు, ముంబై జట్టు మొత్తం ఫీల్డింగ్‌లో అట్టడుగు స్థాయిలో ఉంది. కీలక సమయాల్లో క్యాచ్‌లు వదిలేయడం, మిస్ ఫీల్డింగ్ ద్వారా అదనపు పరుగులు ఇవ్వడం వంటి కారణాలు మ్యాచ్ ఫలితాలను తలకిందులు చేస్తున్నాయి.

ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమణ..

ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో కేవలం మూడింటిలో మాత్రమే విజయం సాధించి, ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈ సీజన్‌లో జట్టు మొత్తం కలిపి 11 క్యాచ్‌లను జారవిడచడం గమనార్హం. స్టార్ ఆటగాళ్లతో కూడిన జట్టు ఇలాంటి ప్రాథమిక తప్పులు చేయడం అభిమానులను విస్మయానికి గురిచేస్తోంది. వచ్చే సీజన్ నాటికి ఫీల్డింగ్ విభాగంలో భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మార్పు అనివార్యం..

ఫీల్డింగ్ అనేది మ్యాచ్ గతిని మార్చే అంశం. “క్యాచ్‌లు పడితేనే మ్యాచ్‌లు గెలుస్తాం” అనే సూత్రాన్ని ముంబై ఆటగాళ్లు విస్మరించినట్లు కనిపిస్తోంది. పంజాబ్ చేతిలో ఓటమికి ప్రధాన కారణం నమన్ ధీర్ వదిలేసిన క్యాచ్ అనడంలో అతిశయోక్తి లేదు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం వచ్చే ఏడాదికి బలమైన పునరాగమనం చేయాలంటే ఫీల్డింగ్ కోచింగ్, ఆటగాళ్ల ఏకాగ్రతపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us