AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moon Rahu Conjunction: కుంభ రాశిలో రాహు, చంద్రుడి కలయిక.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. మే 18న రాహువు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ రోజున అంటే మే 20న చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. దీంతో కుంభ రాశిలో చంద్రుడు, రాహువు కలయిక జరిగింది. ఈ కలయిక వల్ల కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితం మెరుగుపడుతుంది. ఈ కాంబినేషన్ ఏ రాశుల వారికి గొప్పగా ఉండబోతుందో తెలుసుకుందాం.

Moon Rahu Conjunction: కుంభ రాశిలో రాహు, చంద్రుడి కలయిక.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
Moon Rahu Conjunction
Surya Kala
|

Updated on: May 20, 2025 | 9:31 AM

Share

జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని మనస్సు, భావోద్వేగాలకు చిహ్నంగా పరిగణిస్తారు. అయితే రాహువు ఆశయం, ఆకస్మిక మార్పులకు కారకుడు. ఈ రోజు ఉదయం 7:05 గంటలకు చంద్రుడు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. అక్కడ ఇప్పటికే ఉన్న నీడ గ్రహం రాహువుతో సంయోగం ఏర్పడింది. ఈ గ్రహాల కలయిక వల్ల, కొన్ని రాశులకు చెందిన వ్యక్తుల జీవితంలో మంచి రోజులు వస్తాయి. ఈ వ్యక్తులకు అదృష్టం తలపు తడుతుంది. దీనితో పాటు వీరు ప్రతి రంగంలోనూ ప్రయోజనాలను పొందుతారు. ఈ కలయిక ఏ రాశుల వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.

వృషభ రాశి: ఈ కలయిక వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ రాశులకు చెందిన వ్యక్తుల జాతకంలో ఈ సంయోగం పదవ ఇంట్లో ఏర్పడనుంది. ఇది మీ కెరీర్‌లో పెద్ద బ్రేక్ ఇస్తుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు అవకాశం ఉంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం. స్టాక్ మార్కెట్ లేదా ఆస్తిలో లాభం పొందుతారు. విద్యార్థులు కెరీర్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవడానికి ఇది శుభ సమయం. సామాజిక జీవితంలో ప్రజాదరణ పెరుగుతుంది. కుటుంబంతో సంబంధాలు బలపడతాయి.

మిథున రాశి: రాహు, చంద్రుడి కలయిక మిథున రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. ఈ సంయోగం మిథున రాశి వారి జాతకంలో తొమ్మిదవ ఇంట్లో ఉంటుంది. ఇది మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మీ వృత్తి జీవితంలో కొత్త ఎత్తులకు చేరుకుంటారు. ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు బలమైన అవకాశం ఉంది. మీరు రిస్క్ తీసుకొని వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా లాభం వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది శుభ సమయం. విద్యార్థులకు చదువులపై శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలలో మీరు విజయం సాధిస్తారు. మతపరమైన లేదా విదేశీ పర్యటనలు ఉండవచ్చు. కమ్యూనికేషన్ నైపుణ్యాలు సామాజిక జీవితంలో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. కొత్త సంబంధాలు ఏర్పడతాయి.

ఇవి కూడా చదవండి

కన్య రాశి: ఈ కలయిక కన్య రాశి వారికి ఉత్తమంగా ఉంటుంది. కన్య రాశి అధిపతి బుధుడు. ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో ఈ సంయోగం ఆరవ ఇంట్లో ఉంటుంది. ఇది వృత్తి జీవితంలో మీ ప్రత్యర్థులపై విజయం సాధించడంలో వీరికి సహాయపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త బాధ్యతను పొందవచ్చు. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వీరు పెట్టుబడి నుంచి మంచి రాబడిని పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత సమస్యలు తొలగిపోతాయి. సామాజిక జీవితంలో కొత్త సంబంధాలు ఏర్పడతాయి.

తులా రాశి: ఈ కలయిక తుల రాశి వారికి అదృష్టాన్ని చేకూరుస్తుంది. ఈ సంయోగం ఈ రాశికి చెందిన వ్యక్తుల జాతకంలో ఐదవ ఇంట్లో ఉంటుంది. ఇది సృజనాత్మక పనిలో వీరికి విజయాన్ని తెస్తుంది. రచన, చిత్రలేఖనం లేదా సంగీతంలో ప్రతిభ ప్రకాశిస్తుంది. వృత్తి జీవితంలో మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు పెట్టుబడి నుంచి మంచి రాబడిని పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. స్టూడెంట్స్ పరీక్షలలో మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. జీవితంలో ప్రేమ పెరుగుతుంది. సామాజిక జీవితంలో ప్రజాదరణ పెరుగుతుంది.

కుంభ రాశి: ఈ కలయిక కుంభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సంయోగం లగ్న నక్షత్రంలో ఉంటుంది. వ్యక్తిగత, వృత్తి జీవితంలో విశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి పొందవచ్చు. వ్యాపారాలలో కొత్త ఒప్పందాల వల్ల లాభాలు ఉంటాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం. ఆస్తి లేదా స్టాక్ మార్కెట్లో లాభం పొందుతారు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. సామాజిక జీవితంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు