మోదీని మళ్ళీ పొగిడేసిన మోహన్‌బాబు..ఈసారి స్టేట్‌మెంట్ అదిరింది

నటప్రపూర్ణ, విలక్షణ నటుడు మోహన్ బాబు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేశారు. తనను మంచి మిత్రునిగా ఆదరించిన మోదీతో ఇటీవల సమావేశమైన ఘడియలను గుర్తు చేసుకున్నారు. మోదీ లాంటి నేత దేశానికి ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. జఠిలమైన సమస్యలను ఒక్కొటొక్కటే పరిష్కరిస్తూ.. చాణక్య నీతితో దూసుకు వెళుతున్న నరేంద్రమోదీ, అమిత్‌షా వంటి నేతల అవసరం దేశానికి ఎంతో వుందన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు మోదీతో జరిగిన భేటీ వివరాలను […]

మోదీని మళ్ళీ పొగిడేసిన మోహన్‌బాబు..ఈసారి స్టేట్‌మెంట్ అదిరింది
Follow us
Rajesh Sharma

|

Updated on: Jan 08, 2020 | 5:31 PM

నటప్రపూర్ణ, విలక్షణ నటుడు మోహన్ బాబు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆకాశానికెత్తేశారు. తనను మంచి మిత్రునిగా ఆదరించిన మోదీతో ఇటీవల సమావేశమైన ఘడియలను గుర్తు చేసుకున్నారు. మోదీ లాంటి నేత దేశానికి ఎంతో అవసరమని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. జఠిలమైన సమస్యలను ఒక్కొటొక్కటే పరిష్కరిస్తూ.. చాణక్య నీతితో దూసుకు వెళుతున్న నరేంద్రమోదీ, అమిత్‌షా వంటి నేతల అవసరం దేశానికి ఎంతో వుందన్నారు.

తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మోహన్ బాబు మోదీతో జరిగిన భేటీ వివరాలను పంచుకున్నారు. సువిశాల భారత దేశాన్ని పరిపాలించడానికి వాళ్లిద్దరే సరైన అర్హత ఉన్న వ్యక్తులని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని తన జీవితంలో చూడలేదంటూ మోదీ-షా ద్వయాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రధానిని కలవడానికి వెళ్తే ఊహించని విధంగా తనకు స్వాగతం పలికారని హర్షం వ్యక్తం చేశారు.