Gadag Gold Find: లక్కంటే ఇదేనేమో.. లంకబిందెలో దొరికిన నిధి కేసులో ఊహించని ట్విస్ట్!
కర్ణాటకలోని గద్గద్ జిల్లాలో ఇంటి పునాదులు తవ్వుతుండగా రాగి బిందెలో దొరికిన బంగారు నిధి కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. దీన్ని తొలుత నిధిగా భావించినా, పురావస్తు శాఖ పరిశీలనలో అవి కుటుంబ పెద్దలు దాచుకున్నవని తేలింది. దీంతో ఆ బంగారం తిరిగి ఇవ్వాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

రోడ్డుపై 10 రూపాయలు కనిపిస్తేనే చటుక్కున తీసుకొని జేబులో పెట్టుకునే మనుషులు ఉన్న ఈ రోజుల్లో ఓ బాలుడు, అతని కుటుంబం మాత్రం నిజాయితీకి నిలువెత్తు నిర్శనంగా నిలిచారు. తమ ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వుతుండగా.. ఒక రాగి బిందెలో దొరికిన బంగారాన్ని నిధిగా భావించిన కుటుంబ సభ్యులు దాన్ని పోలీసులకు అప్పగించారు. అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం వెలుగు చూసింది. పురావస్తు శాఖ అధికారులు నిధి దొరికిన ఘటనా స్థలాన్ని సందర్శించి, అది నిధి కాదని, కుటుంబ పెద్దలు దాచుకున్న బంగారం అని తేల్చారు. ఇది పురావస్తు శాఖ కిందకు రాదని స్పష్టం చేశారు. దీంతో ఆ కుటుంబ సభ్యులు పట్టరాని ఆనందం వ్యక్తం చేశారు.
ధి దొరకగానే కుటుంబసభ్యులు ఎలాంటి అభ్యంతరం చెప్పకండా దాన్ని అధికారులకు అప్పగించారు. ఇక బంగారం తమ పూర్వికులు దాచిందని తెలియడంతో తమ ఆభరణాలను తమకు తిరిగి ఇచ్చేయాలని సదురు కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు. గ్రామస్థులు సైతం ఆ బంగారం కుటుంబ సభ్యులు చెందాల్సిందే దాన్ని అధికారులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పురావస్తు శాఖ అధికారుల తాజా ప్రకటనతో అధికారులు ఆ బంగారాన్ని తిరిగి ఇస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.
అసలు ఏం జరిగింది?
కర్ణాటక రాష్ట్రంలోని గదగ్ జిల్లాలోని చారిత్రాత్మక లక్కుండి గ్రామంలో ప్రజ్వల్ రిట్టి అనే బాలుడు ఇంటి నిర్మాణం కోసం పునాదులు తవ్వతూ ఉన్నారు. అయితే సరిగ్గా మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఆ బాలుడికి భూమిలొ ఒర నాగి బిందె కనిపించింది. ఏంటా అని తీసి బయటకు తీసి చూశాడు. ఆ బిందెలో పురాతన కాలానికి చెందిన బంగారు ఆభరణాలు కనిపించాయి. ఈ విషయాన్ని ఆ బాలుడు కుటుంబ సభ్యులతో పాటు గ్రామ అదికారులకు తెలియజేశాడు. వారు జిల్లా అధికారుల దృస్టికి తీసుకెళ్లడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకన్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
