జె‌ఎన్‌యు ఘటన.. విద్యార్థులకు దీపిక సంఘీభావం.. బీజేపీ ఆగ్రహం

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో విద్యార్థులకు సంఘీభావంగా అక్కడికి వెళ్లిన బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ వ్యవహారంపై బీజేపీ భగ్గుమంది. ‘టుక్దే టుక్దే గ్యాంగ్’కు దీపిక సపోర్ట్ ఇస్తున్నారని ఈ పార్టీ అధికార ప్రతినిధి సాంబిత్ పత్రాతో బాటు కొంతమంది నేతలు, మంత్రులు ఆమెను విమర్శించారు.ఆమె నటించిన సినిమాలను బహిష్కరించాలని సూచించారు. (మంత్రి ప్రకాష్ జవదేవకర్ మాత్రం.ఎవరైనా.. . ఎక్కడికైనా వెళ్ళవచ్చునని,  నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చునని వ్యాఖ్యానించారు). ఈ […]

జె‌ఎన్‌యు ఘటన.. విద్యార్థులకు దీపిక సంఘీభావం.. బీజేపీ ఆగ్రహం
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 08, 2020 | 6:13 PM

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఘటనల నేపథ్యంలో విద్యార్థులకు సంఘీభావంగా అక్కడికి వెళ్లిన బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ వ్యవహారంపై బీజేపీ భగ్గుమంది. ‘టుక్దే టుక్దే గ్యాంగ్’కు దీపిక సపోర్ట్ ఇస్తున్నారని ఈ పార్టీ అధికార ప్రతినిధి సాంబిత్ పత్రాతో బాటు కొంతమంది నేతలు, మంత్రులు ఆమెను విమర్శించారు.ఆమె నటించిన సినిమాలను బహిష్కరించాలని సూచించారు. (మంత్రి ప్రకాష్ జవదేవకర్ మాత్రం.ఎవరైనా.. . ఎక్కడికైనా వెళ్ళవచ్చునని,  నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలు తెలియజేయవచ్చునని వ్యాఖ్యానించారు). ఈ నెల 6 వ తేదీ రాత్రి యూనివర్సిటీ  క్యాంపస్‌లో జరిగిన హింసాకాండకు నిరసన తెలిపిన విద్యార్థులకు సంఘీభావంగా దీపిక మంగళవారం సాయంత్రం అక్కడికి వెళ్లారు.అయితే దీనిపై మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. తాను వీరికి మద్దతు తెలిపేందుకే వచ్చానన్నారు.

ఈ యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ ఐషే ఘోష్ సహా ఇతర విద్యార్థుల భుజంపై చెయ్యి వేసి ఆమె నిలబడిన తీరు అందరి ‘కళ్ళలో పడి ప్రాధాన్యత’  సంతరించుకుంది. కాగా బీజేపీ నేతలు తేజేందర్ బగ్గా, షానవాజ్ హుసేన్, రామ్ కదమ్ వంటివారు దీపిక తీరును తీవ్రంగా విమర్శించారు.’అఫ్జల్ గ్యాంగ్’ వంటి విద్యార్థుల గుంపును సమర్థించిన ఆమె సినిమాలను బహిష్కరించాలని ట్వీట్ చేశారు. కాగా–యాసిడ్ బాధితురాలి పాత్రలో దీపిక నటించిన ‘ ఛపాక్ ‘ మూవీ ఈ నెల 10న రిలీజ్ కానుంది.

ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
ప్రపంచంలో బెస్ట్‌ ఎయిర్‌పోర్టులు ఏవో తెలుసా..?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు