కూతురి మృతదేహాన్ని మంచంపై ఉంచి 35 కి.మీ. కాలినడక, మధ్యప్రదేశ్ లో ఓ తండ్రి దీనావస్థ ! వీడియోను చూసి నెటిజన్ల ఆవేదన

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిలాల్లో తన కూతురి మృతదేహాన్ని మంచంపై ఉంచి 35 కిలోమీటర్ల దూరం కాలినడకన సుదీర్ఘ ప్రయాణం సాగించాడు ఓ తండ్రి..

  • Publish Date - 8:18 pm, Sun, 9 May 21 Edited By: Phani CH
కూతురి మృతదేహాన్ని మంచంపై ఉంచి 35 కి.మీ. కాలినడక, మధ్యప్రదేశ్ లో ఓ తండ్రి దీనావస్థ ! వీడియోను చూసి నెటిజన్ల ఆవేదన
Man Walks With Daughter's Body

మధ్యప్రదేశ్ లోని సింగ్రౌలీ జిలాల్లో తన కూతురి మృతదేహాన్ని మంచంపై ఉంచి 35 కిలోమీటర్ల దూరం కాలినడకన సుదీర్ఘ ప్రయాణం సాగించాడు ఓ తండ్రి.. జిల్లా ఆసుపత్రిలో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం కోసం తీసుకువెళ్లేందుకు ఏడు గంటలు ఇలా నడిచాడు. ఇద్దరు, ముగ్గురు గ్రామస్థులు కూడా ఆయనకు సహకరించారు. 16 ఏళ్ళ ఇతని కూతురు ఈ నెల 5 న సూసైడ్ చేసుకుంది. గడాయి అనే ఈ గ్రామంలో జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఇక్కడికి వచ్చి ఈ యువతి మృతదేహానికి జిల్లా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయాల్సి ఉందని, అక్కడికి తీసుకురావాలని చెప్పి వెళ్లిపోయారు. అయితే ఆసుపత్రి సుమారు 35 కి.మీ. దూరంలో ఉంది. నిరుపేద అయిన ఈమె తండ్రికి తన కూతురు డెడ్ బాడీని తరలించేందుకు ఏ వాహనాన్నీ సమకూర్చుకోలేకపోయాడు. పైగా అధికారులు కూడా తాము వాహనాన్ని ఏర్పాటు చేయలేమని, అది నువ్వే చూసుకోవాలని చెప్పి చేతులెత్తేశారు. దాంతో ఈ తండ్రి తన కుమార్తె డెడ్ బాడీని మంచం మై వేసుకుని కాలినడకన బయల్దేరాడు, ఉదయం 9 గంటలకు బయల్దేరి సాయంత్రం సుమారు 4 గంటలకు జిల్లా ఆసుపత్రికి చేరాడట.. ఈ వీడియో ఎంతో దయనీయంగా ఉందని, ఆ నిర్భాగ్య పేద తండ్రికి ఎన్ని కష్టాలువచ్చాయని నెటిజన్లు వాపోతున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: చైనా దుందుడుకు చర్య, భారీ రాకెట్ ‘పతనం’పై నాసా ఆగ్రహం, బాధ్యతా రాహిత్య ప్రమాణాలకు మీదే బాధ్యత అంటూ విమర్శ

Telangana Covid-19: కొనసాగుతున్న కరోనా విజృంభణ.. తాజాగా ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే?